అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయ్యారు అయ్యింది ప్రస్తుతం ఓ టీమిండియా క్రికెటర్ పరిస్థితి. ఎంత గొప్పగా రాణిస్తున్నప్పటికీ జట్టులో స్థానం దక్కక ఇప్పటికే బాధ పడుతున్నాడు ఆ ఆటగాడు. ఇది చాలదు అన్నట్లుగా ఇప్పుడు మరో కష్టం వచ్చింది ఈ యువ క్రికెటర్ కు. గత కొన్ని రోజులుగా ఓ నటి, మోడల్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ప్రస్తుతం వీరిద్దరు విడిపోయినట్లు తెలుస్తోంది. దానికి కారణం తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టే. తన సోషల్ మీడియా బ్లాగ్ లో బ్రేకప్ సాంగ్ ను షేర్ చెయ్యడమే కాకుండా.. తన బాయ్ ఫ్రెండ్ ను ఇన్ స్టాలో అన్ ఫాలో కూడా చేసింది.
గత కొంతకాలంగా దేశవాలీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు ఈ యంగ్ ప్లేయర్. అయినప్పటికీ అతడికి జాతీయ జట్టు నుంచి పిలుపు మాత్రం రావడం లేదు. ఈ సమస్యతోనే సతమతమవుతుంటే.. మరో సమస్య ఈ ఆటగాడి నెత్తిన పడింది పాపం. ఇంతకీ ఆ ఆటాగాడు ఎవరంటే? డ్యాషింగ్ బ్యాటర్, జూనియర్ సెహ్వాగ్ గా పిలుచుకునే పృథ్వీ షా. రంజీ ట్రోఫీలో వందల కొద్ది పరుగులు చేశాడు షా. అయినప్పటికీ అతడికి టీమిండియాలో మాత్రం చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే తాజాగా పృథ్వీ షాకు సంబంధించిన మరో వార్త క్రీడాలోకంలో చక్కర్లు కొడుతోంది.
గత కొన్ని రోజులుగా మోడల్, నటి అయిన నిధి తపాడియాతో పృథ్వీ షా డేటింగ్ లో ఉన్నాడు. వీరిద్దరు కలిసి న్యూఇయర్ వేడుకలు కూడా జరుపుకోవడం కెమెరాలకు సైతం చిక్కింది. ఇక తాజాగా వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని సమాచారం. దానికి ఓ కారణం కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో వినికిడి. అదేంటంటే.. తాజాగా నిధి తపాడియా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో పంజాబీ పాటను బ్యాగ్రౌండ్ గా వాడింది. అయితే అది ఒక బ్రేకప్ సాంగ్. ఇదన్న మాట అసలు విషయం. అదీకాక ఇన్ స్ట్రాగ్రామ్ లో పృథ్వీ షా-నిధిలు ఒకరినొకరు అన్ ఫాలో కూడా చేసుకున్నారు. దాంతో వారిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు అనడానికి ఇంతకన్నా బలమైన కారణం ఏముంటుంది అంటున్నారు నెటిజన్స్.
ఇక గతంలో షా బాలీవుడ్ హీరోయిన్ ప్రాచీ సింగ్ తో ప్రేమాయణం నడిపాడని, ఇద్దరు కలిసి పార్టీలకు సైతం వెళ్లారని అప్పట్లో వార్తలు కొడైకూశాయి. ఇక ప్రాచీ బ్రేకప్ చెప్పినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ప్రాచీ-షాలు ఒకరినొకరు ఇన్ స్టాలో అన్ ఫాలో చేసుకున్నాకే బ్రేకప్ వార్తలు వచ్చాయి. దాంతో ఇప్పుడు కూడా నిధి-పృథ్వీ షాలు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని అంతా అనుకుంటున్నారు. మరి పృథ్వీ షా-నిధి తపాడియా బ్రేకప్ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.