నిత్యం క్రికెట్ కు సంబంధించిన ఎన్నో వార్తలు వైరల్ అవుతుంటాయి. మంచి క్యాచ్ పట్టాడనో.. భారీ సిక్సర్ కొట్టాడనో.. ఇలాంటివి చాలాసార్లు వినే ఉంటాం. కానీ.. అలాంటి ఘటనలు జరగాలంటే బాల్ వేసే.. బౌలర్ కావాలి కదా. మరెందుకు బౌలర్ గురుంచి చెప్పడం లేదు అన్నదే ప్రశ్న. చెప్తున్నారు కదా అంటారా? అలాంటి ఘటనలు కొన్ని మాత్రమే. మ్యాజికల్ బాల్ తో బ్యాటర్ ను బౌల్డ్ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని మాత్రం అప్పుడప్పుడు తెరమీదకు వస్తుంటాయి.
రెండేళ్ల క్రితం వెటరన్ క్రికెటర్ ప్రవీణ్ తాంబే.. యువ క్రికెటర్ ఇక్బాల్ అబ్దుల్లాను బౌల్డ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. చూశారుగా.. ఇక్బాల్ అబ్దుల్లా ఎలా బౌల్డ్ అయ్యాడో. పక్క నుంచి వెళ్తుందిలే అనుకున్నా బాల్ కాస్తా.. గిర్రున తిరిగి వికెట్లను తాకేసరికి ఇక్బాల్ అబ్దుల్లాకు అక్కడ ఏం జరిగిందో కూడా తెలియలేదు. అందుకే.. బౌల్డ్ అయ్యాక కూడా కాసేపు అక్కడే నిలబడిపోయాడు. ఎందుకు బాల్ ఆడకుండా వదిలేశానా అనే ఆలోచన ఒకవైపు.. అలా వెళ్లాల్సిన బాల్ వికెట్లను ఎలా తాకిందా అన్న ఆశ్చర్యం మరోవైపు.
ఇది కూడా చదవండి: IPL 2022: CSK కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ
పోనీలే.. ఇందులో ఏముందంటారా?. ఈ ఘటన రెండేళ్ల క్రితం ముంబై 20 లీగ్ లో జరిగింది. ఈ బాల్ వేసిన క్రికెటర్ ప్రవీణ్ తాంబే వయస్సు రెండేళ్ల క్రితం 49 సంవత్సరాలు. అంత వయస్సులో కూడా ఎలా బాల్ ను స్వింగ్ చేస్తున్నారో. లెగ్ బ్రేక్ బౌలరైనా.. తాంబే.. 41 ఏళ్ల వయసున్నపుడు(2013) లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ లో లేటు వయసులో ఎంట్రీ ఇచ్చిన తాంబే.. హ్యాట్రిక్ వికెట్లు తీసి తన కసి, తన కష్టం ముందు.. ఏజ్ ఒక నెంబర్ మాత్రమే అని నిరూపించాడు.
ప్రస్తుతం తాంబే జీవితం ఆధారంగా.. ‘ప్రవీన్ తాంబే ఎవరు?'(Kaun Pravin Tambe?) అనే బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్ రోల్‌లో శ్రేయాస్ తల్పడే నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాటర్ వేదికగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఇది కూడా చదవండి: ఐపీఎల్ క్రేజ్! ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్..!