క్రికెట్‌లో టీ20 ప్రస్థానం మొదలయ్యాక పరుగుల ప్రవాహంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పొట్టి ఫార్మాట్ లో ఉన్న రూల్స్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండడం.. ఎదుర్కొన్న మొదటి బంతి నుంచే బ్యాటర్లు ఎడా పెడా బాధేస్తుండడంతో.. ఎంతటి గొప్ప బౌలరైనా ఏదో ఒకరోజు భారీగా పరుగులు సమర్పించుకోవడం ఖాయం. ఏది ఏమైనా ఈ ధనా ధన్ ఇన్నింగ్స్ లో బ్యాటర్లది కొంచెం పైచేయిగా ఉంటుంది. ఎదుర్కునే ప్రతి బంతికి పరుగు కోసం చూస్తుంటారు. టీ20 ఫార్మాట్ లో ఓవర్లు తక్కువుగా ఉండడంతో.. డాట్ బాల్ పడితే బ్యాటర్లపై ఒత్తిడి పెరగడం సహజం.. అయితే.. భారత యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ టీ20 ఫార్మాట్ లో డాట్ బాల్ అంటే నేరం అంటున్నారు.
క్రికెట్ ప్రస్థానం మొదలయ్యాక.. మొదట్లో టెస్టులకు ఎక్కువ ఆదరణ ఉండేది. ఐదు రోజుల పాటు సాగే టెస్టు మ్యాచులో బ్యాటర్ అవుట్ అవ్వకుండా ఉండడమే.. ప్రధాన లక్ష్యం. ఈ కారణంగా ఆట మందకొడిగా సాగడం.. పరుగులు తక్కువుగా వస్తుంటాయి. రాను రాను.. మార్పులు కారణంగా వన్డే(ఒక్కో ఇన్నింగ్స్ లో 50 ఓవర్లు) మొదలు పెట్టారు. ఆట ఒక్క రోజుకే పరిమితమవ్వడంతో..ఆటలో వేగం పుంజుకుంది. బాల్స్ తగ్గట్టుగా.. 100 స్ట్రైక్ రేట్ కు ఆటో ఇటో రాణించేవారు. ఇక టీ20 ఫార్మాట్(ఒక్కో ఇన్నింగ్స్ లో 20 ఓవర్లు).. ఈ ఫార్మాట్ మొదలయ్యాక.. ఆటలో వేగం మరింత పెరిగింది. ఓవర్లు తక్కువుగా ఉండడం.. జట్టులోని పది మంది సభ్యులు రాణిస్తుండడంతో.. బ్యాటర్లు.. ఇన్నింగ్స్ మొదలైన మొదటి బాల్ నుంచే ఎడా పెడా బాధేస్తున్నారు. టీ20 ఫార్మాట్ లో ఒక్కో జట్టుకు 120 బాల్స్ మాత్రమే కేటాయిస్తారు. అందువకుల్ల ఒక్క డాట్ బాల్ పడ్డా.. బ్యాటర్ పై ఒత్తిడి పెరుగుతుంది.
ఇదే విషయమై.. ప్రస్తుతం భారత అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకరైన శ్రేయాస్ అయ్యర్ టీ20లలో.. ఒక్క డాట్ బాల్ కూడా ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుందని అంగీకరించాడు. “ప్రతి బంతికి స్కోరింగ్ గురించి ఆలోచించాలి. ఒక బ్యాట్స్‌మెన్‌గా, మీరు డాట్ బాల్ ఆడితే అది నేరంగా భావిస్తాను. ఈ ఫార్మాట్ లో బాల్స్ తక్కువుగా ఉంటాయి కావున.. డాట్ బాల్ బ్యాట్స్‌మన్‌పై తీవ్ర భారం చూపుతుందన్నారు”. ఇక శ్రీలంకతో జరిగిన సిరీస్ కి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి, గాయంతో సూర్యకుమార్ యాదవ్ దూరమవ్వడంతో.. మూడవ స్థానంలో బ్యాటింగ్ చేసిన శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. మూడు T20Iల్లో 57, 74, 73 పరుగులతో సిరీస్‌లో 200కి పైగా పరుగులు చేశాడు. భారత జట్టులో మూడవ స్థానం.. చాలా ప్రత్యేకం. ఈ స్థానంలో బ్యాట్టింగ్ చేసే రన్ మెషిన్ విరాట్ కోహ్లీ భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. ప్రస్తుతం ఇదే స్థానంలో బ్యాట్టింగ్ చేస్తున్న అయ్యర్.. బాగా రాణిస్తుండడంతో ఫ్యూచర్ కోహ్లీ అంటున్నారు అభిమానులు.