ఐపీఎల్ ఆడూతు బిజీగా ఉన్న రోహిత్ శర్మపై కోర్టులో కంప్లైంట్ ఫైల్ అయింది. ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇది కాస్త క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
క్రికెటర్లు అందరూ ఐపీఎల్ మూడ్ లో ఉన్నారు. టీమిండియా ఆటగాళ్లయితే ఫుల్ బిజీగా ఉన్నారు. గత సీజన్లతో పోలిస్తే.. ఈసారి ముంబయి ఇండియన్స్ కాస్త తడబడింది. తొలి రెండు మ్యాచుల్లో ఓడిపోయినప్పటికీ.. తాజాగా దిల్లీపై గెలిచి.. పాయింట్స్ ఖాతా తెరిచింది. దాదాపు రెండేళ్ల నుంచి బ్యాటింగ్ లో పూర్తిగా తడబడుతున్న రోహిత్ శర్మ.. అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. చెప్పాలంటే కమ్ బ్యాక్ ఇచ్చాడు. సోషల్ మీడియా అంతా కూడా రోహిత్ ని తెగ పొగిడేస్తున్నారు. ఇలాంటి టైంలో హిట్ మ్యాన్ పై కోర్టులో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడనే న్యూస్ వైరల్ గా మారింది. అభిమానులు షాకవుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా క్రికెటర్లు అంటే యూత్ ఐకాన్స్. కుర్రాళ్లు వీళ్ల ఆటని మాత్రమే కాదు చేసే ప్రతి పనిని గమనిస్తుంటారు. అలా ఈ మధ్య కాలంలో మన ఆటగాళ్లు.. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. వీటి మాయలో యూత్ పడుతున్నారు కూడా. ఇప్పుడు ఈ విషయమై బిహార్ ముజఫర్ పూర్ కి చెందిన సామాజిక కార్యకర్త తమన్నా హస్మీ.. కోర్టులో పిల్ వేశారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, హీరో అమిర్ ఖాన్ తదితరులపై పిల్ వేశాడు. ప్రస్తుతం చూసుకుంటే.. గ్యాంబ్లింగ్ యాప్స్ ని పబ్లిక్ గానే ప్రమోట్ చేస్తున్నారని తన కంప్లైంట్ లో పేర్కొన్నారు.
‘దేశ యువతని వీళ్లు(రోహిత్, హార్దిక్ తదితరులు) పక్కదారి పట్టిస్తున్నారు. బలవంతంగా గ్యాంబ్లింగ్ ఆడేలా చేస్తున్నారు. ఆకర్షణీయమైన ప్రైజులతో యూత్ ని మాయలో పడేస్తున్నారు. ఇలా చేసుకుంటూ పోతే యువత దీనికి బానిసలు అయిపోతారు. క్రికెటర్లు, సినిమా స్టార్స్.. పలు గేమ్ షోలని ప్రమోట్ చేస్తున్నారు. ఐపీఎల్ లో జట్లని ప్రోత్సాహించేలా చేస్తున్నారు. కొందరు బహుమతులు గెలుచుకోవచ్చేమో గానీ చాలామంది మాత్రం ఈ గ్యాంబ్లింగ్ యాప్స్ కు బానిసలుగా మారిపోతారు’ అని సదరు సోషల్ వర్కర్ తమన్నా హస్మీ.. తన పిల్ లో పేర్కొన్నారు. దీనిపై నెక్స్ట్ హియరింగ్ ఏప్రిల్ 20న జరగనుంది. ఇదంతా చూస్తుంటే.. కాస్త సీరియస్ గానే కనిపిస్తుంది. ఏ మాత్రం అటు ఇటు అయినా సరే రోహిత్ శర్మతో పాటు సదరు సెలబ్రిటీలపై పోలీస్ కేసు పెట్టినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు! మరి క్రికెటర్లు, స్టార్ హీరోలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.