టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా.. అతడి పాపులారిటీ అస్సలు తగ్గలేదు. ధోని చేసే ప్రతి పనిని ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. అతడు ఏం చేసినా అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది.
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. రెండేళ్ల కింద రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ ధోని కెరీర్‌లో చివరిదిగా చెబుతున్నారు. మెగా లీగ్ ప్రారంభానికి నెలన్నర టైమ్ కూడా లేదు. దీంతో ధోని మళ్లీ బ్యాట్ పట్టి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇక ధోని అంతర్జాతీయ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ధోని.. అసమాన ప్రతిభ, మొక్కవోని పట్టుదలతో క్రికెట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. అటాకింగ్ బ్యాటింగ్‌తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు ధోని.
కెప్టెన్‌గా టీమిండియాకు టీ20, వన్డే ప్రపంచ కప్‌లు అందించాడు ధోని. టెస్టుల్లో జట్టును అగ్రస్థానంలో నిలిపాడు. ప్లేయర్లుకు దూకుడుగా ఆడటం నేర్పాడు. క్లిష్ట పరిస్థితుల్లో సంయమనం కోల్పోకుండా కూల్‌గా డెసిషన్స్ తీసుకుంటూ ప్రత్యర్థుల పనిపట్టేవాడు. స్టార్ క్రికెటర్‌గా పేరు ప్రఖ్యాతులు, డబ్బులు సంపాదించాడు. అయినా సింపుల్‌గా ఉండటానికే అతడు ఇష్టపడతాడు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ ఫొటోను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మడత మంచంపై ధోని హాయిగా నిద్రిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఎక్కడ అనేది తెలియరాలేదు. ఈ ఫొటోను చూసిన నెటిజన్స్.. ఎంత ఎదిగినా సొంత మూలాలను మర్చిపోవద్దనే దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు. ధోని సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు.