‘భారత్- పాకిస్తాన్‘ ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ఉండే కిక్కే వేరు. ఇరుదేశాల అభిమానులతో పాటు యావత్ ప్రపంచం దృష్టంతా ఆ మ్యాచ్ వైపే ఉంటుంది. ఇక క్రికెట్ ప్రేమికులైతే.. ఆరోజు టీవీలకు అతుక్కుపోయి ఉంటారు. అయితే.. సరిహద్దు వివాదాలు, దౌత్య కారణాల కారణంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు జరగటం కనుమరుగైపోయింది. ఏదో అడపాదడపా ఐసీసీ టోర్నీల్లో తలపడతున్నా.. అవి అభిమానులకు సరిపొవట్లేవు. ఇదిలావుంచితే.. ఇకపై ఈ ఇరు జట్ల ప్రతిష్టాత్మక టోర్నీల్లో తలపడేది కూడా అనుమానంగా మారింది. ఇరుదేశాల క్రికెట్ బోర్డుల మధ్య అగ్గి రాజేసిన ‘బాయికాట్’ నినాదం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది.
వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్ వేదికగా ‘2023 వన్డే వరల్డ్ కప్’ జరగాల్సి ఉంది. అయితే.. ఈ టోర్నీకి ముందే పాక్ గడ్డపై 2023 ఆసియా కప్ టోర్నీ నిర్వహించాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత జట్టు పాల్గొనాలంటే పాక్ లో పర్యటించాలి. లేదంటే వేదికైనా మారాలి. ఈ విషయంపై లెక్కలేనన్ని పుకార్లు పుట్టుకురాగా, బీసీసీఐ కార్యదర్శి జై షా వాటన్నిటికి తెరదించాడు. భారత్.. పాక్ గడ్డపై కాలుపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. అంతేకాదు.. అవసరమైతే ఆసియా కప్ వేదికను మారుస్తామని స్పష్టం చేశాడు. ఈ విషయంపై స్పందించిన పాక్ బోర్డు అదే జరిగితే.. 2023 వన్డే వరల్డ్ కప్ ను బాయికాట్ చేస్తామని ప్రకటించింది. తాజాగా, ఇదే విషయమై.. పీసీబీ చీఫ్ రమీజ్ రాజా మరోసారి స్పందించాడు.
Ramiz Raja on On Ind vs Pak Games of Test Cricket pic.twitter.com/2qIPYXOFj8
— RVCJ Media (@RVCJ_FB) December 6, 2022
బీబీసీ టెస్ట్ మ్యాచ్ స్పెషల్ ప్రోగ్రాంలో మాట్లాడిన రమీజ్ రాజా.. పాక్ లో 2023 ఆసియా కప్ నిర్వహించకుండా అడ్డుపడితే వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనిలేదని స్పష్టం చేశాడు. భద్రతా కారణాల దృష్ట్యా భారత పర్యటనకు పాక్‌ను ప్రభుత్వం అనుమతించకపోతే? అని నోరు జారిన రమీజ్ రాజా.. ముందుగా బీసీసీఐ ఈ వివాదాన్ని మొదలు పెట్టిందని చెప్పుకొచ్చాడు. “టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా-పాకిస్థాన్, మ్యాచ్ చూశారుగా. 90 వేల మంది ప్రేక్షకులు వచ్చారు. భారత జట్టుపై, పాకిస్థాన్ అద్భుత విజయం సాధించింది. క్రికెట్‌లో బ్యాటు, బంతి మాత్రమే మాట్లాడుతాయి. రాజకీయాలతో సంబంధం లేకుండా పాక్ పర్యటనకు రావాలి. అలా జరిగితే.. ఆట వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి..” అని రమీజ్ రాజా తెలిపాడు.
How about India vs Pakistan Test series?🤔#INDvPAK | #India | #Pakistan | @iramizraja pic.twitter.com/oOt8z6iO09
— CricTracker (@Cricketracker) December 6, 2022
Ramiz Raja is not coming slow😎#Cricket #RamizRaja #PCB #BCCI pic.twitter.com/MDI4xuuE4Z
— Cricket Pakistan (@cricketpakcompk) December 2, 2022