స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న శ్రీలంక ఆటగాళ్లపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఆతిధ్య జట్టుకు చెందిన ఆటగాళ్లు వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. ఇక రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుండగానే ఓపెనర్ పథుమ్ నిస్సంకకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆటగాళ్లు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటివరకు కోవిడ్ బారిన పడిన లంక ఆటగాళ్ల సంఖ్య ఆరుకు చేరింది.
మూడో రోజు ఆట మధ్యలో అస్వస్థతకు గురైన నిస్సంకకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో అతను మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. అతని స్థానంలో ఒషాడ ఫెర్నాండో కోవిడ్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చాడు. అంతకుముందు తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా లంక స్టార్ ఆటగాడు ఏంజలో మాథ్యూస్ సైతం ఇలానే మ్యాచ్ మధ్యలో కోవిడ్ బారిన పడ్డాడు. ఆ తర్వాత జట్టు మొత్తానికి జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మరో నలుగురికి (ప్రవీణ్ జయవిక్రమ, ధనంజయ డిసిల్వా, జెఫ్రె వాండర్సే, అషిత ఫెర్నాండో) కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
Pathum Nissanka has tested positive for Covid-19 and is out of second Test, Oshada Fernando comes into the Sri Lankan XI as a covid replacement.#CricTracker #PathumNissanka #OshadaFernando #SriLanka pic.twitter.com/bTmkAKbFtP
— CricTracker (@Cricketracker) July 11, 2022
ఇదిలా ఉంటే.. కోవిడ్ కేసు వెలుగుచూసినా మ్యాచ్ యధాతథంగా కొనసాగుతుంది. తొలి టెస్టులో ఓడిన ఆతిధ్య జట్టు రెండో టెస్టులో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో పోరాడుతోంది. ఆస్ట్రేలియా పై తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసిన శ్రీలంక జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో ఆ జట్టును ఆలౌట్ చేసే పనిలో పడింది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. మార్నస్ లాబుస్చాగ్నే(29), కామెరాన్ గ్రీన్(20) క్రీజులో ఉన్నారు.
ఇక.. నాలుగో రోజు ఆటలో సెంచరీ హీరో దినేశ్ చండీమాల్ మరింత రెచ్చిపోయి డబుల్ బాదడంతో శ్రీలంకకు 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అంతకుముందు స్టీవ్ స్మిత్ (145 నాటౌట్), లబూషేన్ (104) శతకాలతో రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. ఇలా.. శ్రీలంక జట్టులో వరుసగా కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నా ప్రత్యర్ధి ఆస్ట్రేలియా జట్టులో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
💯💯
Dinesh Chandimal brings up his maiden double ton in Test cricket! 🔥🔥#SLvAUS pic.twitter.com/SlaHMIxEg7— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 11, 2022