బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మరో రెండు టెస్టు మ్యాచ్‌లు, ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ ఉండగా.. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్వదేశానికి వెళ్లిపోయాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాను వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. తొలి రెండు టెస్టుల్లో దారుణమైన ఓటములను మూటగట్టుకొని ట్రోఫీ గెలిచే అవకాశాలను ఎలాగో కోల్పోయింది. కనీసం మిగిలిన రెండు టెస్టుల్లోనైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. అయినా కూడా ట్రోఫీ ఇండియాతోనే ఉంటుంది. ఎందుకంటే ఇరు జట్లు సిరీస్ సమం చేసుకున్నప్పటికీ మాజీ విజేత దగ్గరే ట్రోఫీని ఉంచుతారు. దీనితో ఆస్ట్రేలియాకు ఎలాగో సిరీస్ గెలిచే అవకాశమైతే లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా పోరాడాల్సింది డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కోసమే. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఇప్పటికే గాయంతో స్వదేశానికి పయనవుతున్న వార్నర్ బాటలోనే ఆ టీం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా చేరనున్నాడు.
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సోమవారం ఉన్నపళంగా స్వదేశానికి బయలుదేరాడు. వ్యక్తిగత కారణాల వల్ల కమిన్స్ సిడ్నీ వెళ్లేందుకు సిద్దమవుతున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియానే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అయితే ఇండోర్‌లో జరగబోయే 3వ టెస్టు మ్యాచ్‌కు మాత్రం కమిన్స్ అందుబాటులో ఉండనున్నాడు. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో కమిన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ రెండో టెస్టు 5 రోజులు జరిగినా.. కమిమిన్స్ స్వదేశానికి వెళ్ళేవాడు, కానీ అప్పుడు 3వ టెస్టుకు మాత్రం అందుబాటులో ఉండే అవకాశం చాల తక్కువ. రెండో టెస్టు రెండున్నర రోజుల్లోనే ముగియడంతో మూడో టెస్టుకు ఇంకా 10 రోజుల సమయం ఉంది. ఈ లోపు కమిన్స్‌కి చాలా సమయం ఉండడంతో మూడో టెస్టు సమయానికి జట్టుతో చేరే అవకాశముంది.
ఒకవేళ కమిన్స్ మూడో టెస్ట్ సమయానికి అందుబాటులో లేకపోతే ఆ జట్టు వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సారథిగా వ్యవహరించనున్నాడు.ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా 0-2 తో వెనుకబడిన సంగతి తెలిసిందే. మార్చ్ 1న ఇండోర్‌లో 3వ టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కి దూరమయ్యే ప్రమాదం ఉంది. మిగిలిన రెండు మ్యాచుల్లో ఓడిపోయి ఆస్ట్రేలియా వైట్ వాష్‌కు గురైతే గనుక.. శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్‌పై ఆధారపడాల్సి వస్తోంది. దీనితో ఇప్పుడు ఆస్ట్రేలియా మిగిలిన రెండు టెస్టు మ్యాచ్ లను కనీసం డ్రా అయినా చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.మరి ఆస్ట్రేలియా ఎలాంటి కం బ్యాక్ ఇస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Pat Cummins returns to Australia due to personal reasons.
If he doesn’t return on time for the 3rd Test, Steven Smith might captain the team.
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 20, 2023