తల్లి అనారోగ్యంతో ఉంటే ఏ బిడ్డైనా మనశ్శాంతిలో ఎలా ఉండగలడు. అతను ఎంత గొప్పోడైనా, ఏ స్థాయిలో ఉన్నా.. తల్లి ఆస్పత్రిలో ఉంటే మనిషి మనిషలా ఉండలేడు.. తల్లి పక్కనే ఉంటే కాస్త మనసుకు కాస్త కుదుటగా ఉంటుంది. ప్రస్తుతం ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ పరిస్థితి కూడా ఇదే..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఇప్పటికే తొలి రెండు టెస్టులు గెలిచి పైచేయి సాధించింది. మిగిలిన రెండు టెస్టుల్లో కూడా విజయం సాధించి ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది. తొలి రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిపోవడంతో ఆస్ట్రేలియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ దేశ మాజీ క్రికెటర్లు సైతం ఆసీస్ టీమ్‌పై విమర్శల దాడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్వదేశానికి వెళ్లిపోయి.. మూడో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని ప్రకటించాడు. ఇప్పటికే గాయాలతో స్టార్ ప్లేయర్లు జోస్ హెజెల్‌వుడ్, డేవిడ్ వార్నర్‌లు చివరి రెండు టెస్టులకు దూరమైన నేపథ్యంలో కమ్మిన్స్ గైర్హాజరీ ఆసీస్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది.
ఈ విషయం తెలిసినా కూడా ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ మూడో టెస్టుకు దూరం అయ్యేందుకే నిర్ణయించుకున్నాడు. అయితే.. ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉండి, ఎంతో ప్రతిష్టత్మకమైన సిరీస్‌ను కాదని, అందులోనూ జట్టు ఎంతో క్లిష్టపరిస్థితుల్లో ఉన్నా కూడా కమిన్స్ స్వదేశంలోనే ఉండిపోవడానికి అంత బలమైన కారణం ఏంటని చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. కమ్మిన్స్ అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలిస్తే.. మీరు కూడా కమ్మిన్స్‌కు హ్యాట్సాఫ్ చెప్తారు. కమిన్స్ మూడో టెస్టుకు దూరమైంది అతని తల్లి కోసం. ప్రస్తుతం కమిన్స్ తల్లి.. తీవ్ర అనారోగ్యంలో జీవితం చివరి క్షణాల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెతోనే ఉండాలని కమ్మిన్స్ నిర్ణయించుకున్నాడు.
తన తల్లి అంటే కమ్మిన్స్‌కు అంత ప్రేమ. నిజానికి.. ఒక మనిషి ఎంత ఎదిగినా, పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టి తానో కుటుంబానికి పెద్దైన తర్వాత కూడా తల్లిదండ్రుల ముందు పసివాడిగా మారిపోతాడు. ప్రస్తుతం కమ్మిన్స్ పరిస్థితి కూడా అంతే. తనను నవమాసాలు మోసి, కనీ పెంచి ఇంతటి వాడిని చేసి, దేశానికి ప్రాతినిథ్యం వహించే ఒక గొప్ప క్రికెటర్‌గా తీర్చిదిద్దిన తల్లి.. ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. మరికొన్ని రోజుల్లో మనల్ని, ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతుందని తెలిసికమ్మిన్స్ గుండె బాధతో బరువెక్కింది. ఉన్న కొన్ని రోజులైనా తన తల్లితో ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు. పైగా కమ్మిన్స్ ప్రస్తుతం అంతగా ఫామ్‌లో కూడా లేడు. తన స్థానంలో కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్, బౌలర్‌గా స్టార్క్ ఎలాగో జట్టులో ఉన్నారనే ధైర్యంతో కమిన్స్ తల్లితో కొన్ని రోజులు గడిపేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఈ వయసులోనూ కమ్మిన్స్ తన తల్లిపై చూపిస్తున్న ఈ ప్రేమకు క్రికెట్ అభిమానులు హర్షిస్తూ.. కమ్మిన్స్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
BREAKING: Pat Cummins has been RULED out of the 3rd Test, as he will not reach India on time due to family reasons. #INDvAUS #PatCummins #BGT2023 #CricketTwitter pic.twitter.com/McJ3BLT4kb
— OneCricket (@OneCricketApp) February 24, 2023