భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సిరీస్‌కు కూడా ఆసీస్‌కు ఆటగాళ్ల గైర్హాజరీ ముప్పు తప్పేలా లేదు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేవలం ఇంకొక టెస్ట్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా జట్లు అహ్మదాబాద్‌లో చివరిదైన నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడుతుండగా.. ఈ టెస్ట్ తర్వాత.. షెడ్యూల్లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నెల 17న వన్డే సిరీస్ ప్రారంభమై.. 22న మూడో వన్డే తో ఆస్ట్రేలియా టూర్ ముగుస్తుంది. ఈ మూడు వన్డేలకు వరుసగా ముంబై, విశాఖపట్నం, చెన్నై ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుత టెస్టు సిరీస్ లో కొంతమంది స్టార్ ప్లేయర్ల గాయాలతో సిరీస్ కి దూరమైన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆసీస్ కి వన్డేల్లో కూడా ఆ సమస్య కొనసాగేలా కనిపిస్తోంది. తాజాగా ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా వన్డే సిరీస్ కి దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో వార్నర్ గాయం కారణంగా అర్ధాంతరంగా తప్పుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన వార్నర్ రెండో ఇన్నింగ్స్ లో ఫీల్డింగ్ చేస్తుండగా మోచేతి గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో స్వదేశానికి వెళ్ళిపోయి.. ప్రస్తుతం గాయం నుండి కోలుకుంటున్నాడు. అయితే వార్నర్ గాయం నుంచి కోలుకోని పూర్తి ఫిట్ నెస్ సాధించడానికి ఇంకో రెండు మూడు వారల సమయం పడుతుందని డాక్టర్లు సూచించడంతో.. వన్డే సిరీస్ తో పాటుగా కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లకు సైతం వార్నర్ దూరం కానున్నాడని సమాచారం.
ఇప్పటికే ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ సన్ గాయం కారణంగా తప్పుకోగా.. కెప్టెన్ కమ్మిన్స్, తన తల్లి అనారోగ్యం కారణంగా వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. ఒకవేళ కమ్మిన్స్ వన్డే సిరీస్ కి అందుబాటులో లేకపోతే అతని స్థానంలో స్టీవ్ స్మిత్ జట్టు కి నాయకత్వం వహించనున్నాడు. ఇప్పుడు వార్నర్ పూర్తి ఫిట్ నెస్ తో లేకపోవడం ఆ జట్టుని మరింత కష్టాల్లోకి నెట్టింది. ప్రస్తుతం వార్నర్ ఏమంత గొప్ప ఫామ్ లో లేకపోయినా ఒక్క మంచి ఇన్నింగ్స్ తో తిరిగి ఫామ్ లోకి రాగలడు. మరి ఇలా ఒకొక్క స్టార్ ప్లేయర్ దూరమవ్వడం ఆసీస్ టీం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో వన్డే సిరీస్ వరకు వేచి చూడాల్సిందే. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Steve Smith will continue to lead Australia in his absence.#INDvAUS #PatCummins #SteveSmith pic.twitter.com/l58fmjg9d3
— 100MB (@100MasterBlastr) March 6, 2023