అలనాటి స్టార్ ఆటగాళ్లు మరోసారి మైదానంలో సందడి చేశారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 రెండో సీజన్‌లో భాగంగా వరల్డ్ జెయింట్స్‌తో ఇండియా మహరాజాస్ టీమ్ పోటీపడింది. కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తి కరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇండియా మహరాజాస్ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ చేసిన తప్పిదానికి.. అంపైర్ జట్టు మొత్తానికి పెనాల్టీ వేసి.. ప్రత్యర్థికి ఫ్రీగా 5 పరుగులు ఇచ్చాడు. అసలు ఏం జరిగిందంటే.. వరల్డ్ జెయింట్స్ ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో అశోక్ దిండా వేసిన మూడో బంతిని పెరెరా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్‌ను మిస్ అయి కీపర్ పార్థీవ్‌పటేల్ చేతుల్లోకి వెళ్లింది.
బంతి వేగాన్ని అంచనా వేయడంలో విఫలం అయిన పార్థీవ్.. దాన్ని పట్టుకోలేకపోయాడు. దాంతో చేజారిన బంతి.. మైదానంలో పార్దీవ్ పటేల్ తన వెనకాల పెట్టుకున్న హెల్మెట్‌కు తగిలి ఆగింది. వెంటనే అంపైర్ పెనాల్టీ కింద ఐదు పరుగులను ప్రత్యర్థి జట్టు స్కోర్‌కు జత చేశారు. నిజానికి అది నో బాల్‌కాదు, బైస్ కాదు, అలాగని ఆ బంతి అంతవేగంగా బౌండరీ లైన్‌కు దూసుకెళ్లడం లేదు. కేవలం హెల్మెట్‌కు తగిలి ఆగిందని అంపైర్ ఈ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఈ షాకింగ్ ఘటనతో పార్థివ్ పటేల్ అవాక్కైయ్యాడు. బౌలర్ అశోక్ దిండా, ఇండియా మహరాజాస్ కెప్టెన్ హర్భజన్ సింగ్ ఈ ఫన్నీ ఘటనకు నవ్వుకున్నారు. గతంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి ఘటనలు చాలా అరుదు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వరల్ట్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్ కెవిన్ ఒబ్రెయిన్ 31 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు చేసి చెలరేగగా.. రామ్‌దిన్ 29 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 42 పరుగులతో రాణించడంతో వరల్డ్ జెయింట్స్ మంచి స్కోర్ సాధించింది. కెప్టెన్ కలిస్ కేవలం 12 పరుగులే చేసి నిరాశ పరిచాడు. ఇండియా మహరాజాస్ బౌలర్ పంకజ్ సింగ్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఇక 171 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఇండియా మహరాజాస్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లో ఒక ఫోర్ కొట్టిన డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ అదే ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు.
మరో ఓపెనర్ పార్థీవ్ పటేల్ సైతం 18 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. శ్రీవాస్తవా 39 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 54 పరుగులు చేసి రాణించాడు. మొహమ్మద్ కైఫ్ 11 రన్స్‌చేసి నిరాశ పరిచాడు. యూసుఫ్ పఠాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 50 రన్స్.. ఇర్ఫాన్ పఠాన్ 9 బంతుల్లోనే మూడు సిక్సులతో 20 పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. దీంతో ఇండియా మహరాజాస్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసి గెలుపొందింది. 5 వికెట్లతో అదరగొట్టిన పంకజ్‌సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ ప్రత్యేకమైన మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో ప్రపంచ టీమ్‌పై భారత్ విజయం సాధించడంపై క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మ్యాచ్‌లో పార్థీవ్ పటేల్ హెల్మెట్ బాల్ తగిలి ఆగడంతో అంపైర్ ఇచ్చిన ఐదు పెనాల్టీ రన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Five runs penalty for India Maharajas as the ball touched Parthiv Patel’s helmet.
📸: Disney+Hotstar pic.twitter.com/2esUlfPti9
— CricTracker (@Cricketracker) September 16, 2022
ఇది కూడా చదవండి: సంజూ శాంసన్‌ను మరిపిస్తున్న కేరళ కుర్రాడు! 6 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు