నిన్నటి వరకూ అంజిక్యా రహానే, చటేశ్వర్ పుజారాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ కంటే ముందు దారుణమైన ఫామ్‌తో కెరీర్‌నే ప్రశ్నార్థకంగా మార్చుకున్నారు. దీంతో వీరిద్దరి కెరీర్‌కు పుల్‌స్టాప్ పడే టైమ్‌మొచ్చిందని అంతా భావించారు, విమర్శించారు. కానీ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అవసరమైన భాగస్వామ్యం నిర్మించి.. హాఫ్ సెంచరీలతో పర్వాలేదనిపించారు. దీంతో వీరిపై కొంత విమర్శలు తగ్గాయి.
Comeback stronger champ 😔❤️@RishabhPant17 #RishabhPant pic.twitter.com/kRzIoJ8GpO
— Sweety🖤 (@SweetyTarak29) January 6, 2022
కాగా ఈ ఇద్దరు సీనియర్ల ఫెల్యుయిర్‌తో రిషభ్ పంత్ పూర్‌ఫామ్ కనిపించలేదు. ఇప్పుడు వీరిద్దరూ ఫామ్‌ను అందుకోవడం, పంతానికి వెళ్లి రిషభ్ పంత్ వికెట్ పారేసుకున్న తీరుతో అందరి దృష్టి ఒక్కసారిగా పంత్‌పై పడింది. వాస్తవానికి పంత్ గత 10 ఇన్సింగ్స్‌లో కేవలం ఒకే హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా 9 ఇన్నింగ్స్‌లలో దారుణంగా విఫలం అయ్యాడు. 0, 17, 34, 8, 50, 9, 1, 2, 22, 37 ఇవి.. పంత్ గత పది ఇన్నింగ్స్‌లలో చేసిన పరుగులు. ప్రస్తుతం పంత్ ఫామ్‌లో లేడు. పుజారా, రహానే లాంటి సీనియర్ల వైఫల్యాల మాటున పంత్ పూర్ ఫామ్ ఉండిపోయింది. కానీ ఇప్పుడు పంత్ కూడా తన బ్యాటింగ్‌కు పదుపెట్టాల్సిన టైమ్ వచ్చింది. వాస్తవానికి పంత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే సమయం టీమిండియాకు చాలా కీలకం. ఆ సమయంలో పంత్ కొంత సమన్వయంతో ఆడి కొన్ని పరుగులు చేసి ఉంటే భారత్ మంచి ఆధిక్యం లభించి, మ్యాచ్‌పై పట్టుసాధించే అవకాశం ఉండేది. కానీ ప్రత్యర్థి ఆటగాళ్ల కవ్వింపులకు సహనం కోల్పోయి అనవసరపు షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు.
Rishabh Pant’s scores since the WTC final:
4,
41,
25,
37,
22,
2,
1,
9,
50,
8,
34,
17,
0#SAvIND— Cric_special (@cric_special) January 6, 2022
ప్రత్యర్థి వ్యూహానికి చిక్కిన జింకపిల్లలా పెవిలియన్ చేరాడు. దీంతో పంత్‌పై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే వైఖరి మార్చుకుని పరిపూర్ణమైన స్థితి ప్రజ్ఞత ప్రదర్శించకుంటే.. రాబోయే మ్యాచ్‌లలో కష్టమే అని క్రికెట్ నిపుణులు అంటున్నారు. అనవసరమైన పంతానికి, షాట్లకు పోకుండా.. శాంతంగా బ్యాటింగ్‌పై, జట్టు అవసరాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. చూడాలి మరి పంత్.. మూడో టెస్టులోనైనా రాణిస్తాడో? లేదో?. మరి ఈ పంత్ ఫామ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ప్రియురాలితో విడిపోయిన రిషబ్ పంత్! ఇంత గొడవ జరిగిందా?