ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ అందరకి గుర్తుండే ఉంటోంది. ఈ టోర్నీలో భారత జట్టు సెమీస్ లోనే ఇంటిదారిపడితే.. లీగ్ స్టేజ్ లోనే నిష్క్రమిస్తుందనుకున్న పాక్.. అనూహ్యంగా ఫైనల్ కు కూడా చేరింది. నెదర్లాండ్స్ సాయంతో సెమీస్ చేరిన పాక్.. ఆ తరువాత కివీస్ ను మట్టికరిపించి ఫైనల్ లో అడుగుపెట్టింది. ఈ టోర్నీలో పాక్ విజేతగా నిలవకపోయినా.. వారాడిన ఆటకు అక్కడివరకు రావడమే గొప్ప. ఇదంతా పక్కన పెడితే.. ఈ టోర్నీలో పాకిస్తాన్ మహిళా అభిమాని చేసిన రచ్చ అందరకీ గుర్తుండే ఉంటుంది. పాకిస్తాన్ ఆడిన మ్యాచులన్నింటిని ప్రత్యక్షంగా వీక్షించడానికి.. స్టేడియంకు వచ్చే ఆ అభిమాని.. ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునేది.
మొదటిసారి ‘పాకిస్తాన్ vs న్యూజిలాండ్’ సెమీస్ మ్యాచ్‌లో కనపడ్డ ఆ ముద్దగమ్మ.. గాల్లోకి ముద్దులు విసురుతూ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేసింది. తాను చేసిన ఫ్లైయింగ్ కిస్సులు.. తన బోల్డ్ లుక్.. అభిమానులను బాగానే ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ కూడా పదే పదే ఆ అమ్మాయి వైపే చూపించాడు. దీంతో ఈ మిస్టరీ గర్ల్ ఎవరా అని నెటిజన్లు ఆరా తీశారు. ఆ అమ్మాయి పేరు.. నటాషా నాజ్. అనంతరం.. తాను విరాట్ కోహ్లికి పెద్ద అభిమానిని అని ట్విట్టర్ ద్వారా తెలిపిన ఆమె.. తనను ఇంతలా పాపులర్ చేసిన భారత అభిమానులకు థ్యాంక్స్ కూడా చెప్పింది. అంతేకాదు ఫైనల్స్‌లో ఆదివారం కలుద్దామని మ్యాచ్ తర్వాత ట్వీట్ చేసింది. అయితే దురదృష్టవశాత్తూ భారత్ ఫైనల్ చేరుకోలేకపోయింది.
Thankyou so much Indians 💚🙏 Pakistan 🇵🇰💚 pic.twitter.com/FbBSQziH41
— Natasha Parody (@NatashaOfficiaI) November 10, 2022
అయితే.. తాజగా, ఈ బ్యూటీ.. ఇండియన్స్ ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టింది. “భారతీయులారా! నన్ను పెళ్లి చేసుకోండి..” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ ట్వీట్ కాస్తా వైరల్ గా మారడంతో.. భారత అభిమానుల నుంచి ట్వీట్లు పోటెత్తాయి. ప్రొపోజల్ ను యాక్సెప్ట్ చేసేవారు కొందరైతే.. తిరస్కిరించేవారు మరికొందరు. నటాషా పాక్ సంతతికి చెందిన అమ్మాయి అయినప్పటికీ.. చిన్ననాటి నుండి ఆస్ట్రేలియాలోనే నివాసముంటోంది. చూడాలి.. ఈ ముద్దుగుమ్మకు కాబోయే భారతీయ వరుడెవరో.
I will marry you with your acceptance
— Srinivasa Rao K (@Sriniva91620900) December 1, 2022
you are very beautiful i will marry you
— Dr.dinesh raj (@Drdineshraj2) December 2, 2022