భారతీయులతో సహా ప్రపంచం మొత్తం తనను గొప్ప బౌలర్‌గా కొనియాడుతుంటే.. తన సొంత దేశం పాకిస్థాన్‌లోని సోషల్ మీడియా యువత తనను మ్యాచ్ ఫిక్సర్‌గా అవమానిస్తుందంటూ.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆవేదన చెందుతున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో మంచి బౌలింగ్ ఫిగర్స్ ఉన్న వసీం అక్రమ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బౌలర్స్‌లో ఒకడు. అందులో ఎలాంటి సందేహం లేదు. తన అద్భుతమైన బౌలింగ్ ఎబిలిటీతో వసీం అక్రమ్ ఎన్నో మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. పాకిస్థాన్ క్రికెట్‌లో వసీం అక్రమ్ నంబర్ వన్ బౌలర్‌గా కూడా ఉన్నాడు. కానీ.. పాక్‌లో మాత్రం వసీం అక్రమ్‌ను ఒక దేశద్రోహిగానే చూస్తున్నారు. అందుకు ఒక బలమైన కారణం కూడా ఉంది.
1996 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా ఇండియా-పాకిస్థాన్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. ఎంతో కీలకమైన ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే.. సెమీస్ చేరుతాయి. ఇలాంటి డూఆర్‌డై మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ అందరికీ షాకిచ్చింది. అప్పటి వరకు సూపర్ ఫామ్‌లో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ వసీం అక్రమ్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టును క్వార్టర్ ఫైనల్స్ వరకూ తీసుకొచ్చాడు. కానీ.. అనూహ్యంగా చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో మ్యాచ్ కోసం వసీం అక్రమ్ టాస్‌కు రాలేదు. అతని స్థానంలో అమీర్ సోహైల్ పాకిస్థాన్ కెప్టెన్‌గా టాస్ కోసం వచ్చాడు. దీంతో ఇండియాతో పాటు.. పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు షాక్ తిన్నారు.
ఇంత కీలకమైన మ్యాచ్, అది కూడా ఇండియాతో మ్యాచ్‌కు వసీం అక్రమ్ లాంటి మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్‌ను ఆడకపోవడం ఏంటని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. నిజానికి టాస్ వరకూ కూడా వసీం అక్రమ్ మ్యాచ్ ఆడటం లేదనే విషయం ఎవరీ తెలియదు. ఆ మ్యాచ్‌లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడంతో.. వసీం అక్రమ్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని అందుకే మ్యాచ్ ఆడలేదని.. పాకిస్థాక్ క్రికెట్ అభిమానులు అక్రమ్‌పై ఆగ్రహంతో రగిలిపోయారు. ఇప్పటికీ కూడా 1996 వరల్డ్ కప్ అంటే వసీం అక్రమ్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడనే చాలా మంది పాక్ అభిమానులు పేర్కొంటూ ఉంటారు. తాజాగా టీ20 వరల్డ్ కప 2022 సందర్భంగా ఒక టీవీ షోలో మ్యాచ్ విశ్లేషణ పాల్గొన్న సమయంలోనూ వసీం అక్రమ్‌కు 1996 వరల్డ్ కప్‌లో ఇండియాతో మ్యాచ్ ఎందుకు ఆడలేదనే ప్రశ్న ఎదురైంది.
ఆ సమయంలో వసీం అక్రమ్ కొంత ఆసహనానికి గురై.. పాకిస్థాన్ యువత సోషల్ మీడియాలో వచ్చే దాన్నే నిజమని నమ్ముతున్నారని.. అసలు ఆ రోజు ఏం జరిగిందో పాక్ యువతకు ఈ రోజు చెబుతానని వసీం అక్రమ్ మాట్లాడుతూ.. భారత్‌తో మ్యాచ్ తమకెంతో కీలకమని తనను తెలుసని.. కానీ, ఇండియాతో మ్యాచ్‌కు ముందు తనకు గాయమైందని, అయినా సరే మ్యాచ్ ఆడేందుకే తాను సిద్ధమైనట్లు.. అందుకోసం నొప్పిని తట్టుకోడానికి రెండు ఇంజెక‌్షన్లు సైతం తీసుకున్నట్లు వసీం పేర్కొన్నాడు. అయినా కూడా ఫలితం లేకపోవడంతో మ్యాచ్ ఆడలేకపోయానని, కానీ.. ఆ విషయం బయటికి చెప్పకూడదని టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు వసీం వెల్లడించారు. వసీం అక్రమ్ లాంటి మెయిన్ బౌలర్ మ్యాచ్ ఆడటం లేదని తెలిస్తే.. భారత బ్యాటర్లలో ఆత్మవిశ్వాసం పెరిగి మరింత ఫ్రీగా ఆడతారనే తనకు గాయమైన విషయం బయటపెట్టలేదని అన్నాడు. అయినా కూడా పాక్ యువత తనను మ్యాచ్ ఫిక్సర్‌గానే చూస్తోందని వసీం ఆవేదన వ్యక్తం చేశారు.