ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో ఇంగ్లండ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో ఆ జట్టు 5 వికెట్లతో ఘన విజయం సాధించి.. రెండో పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. దీంతో రెండో సారి టీ20 వరల్డ్ కప్‌ను గెలిచిన రెండో జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. అంతకంటే ముందు వెస్టిండీస్ రెండుసార్లు టీ20 ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ విషయం పక్కనపెడితే.. సూపర్ 12లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్, జింబాబ్వే చేతుల్లో ఓడినా పాకిస్థాన్ అదృష్టం కొద్ది సెమీస్ చేరిన విషయం తెలిసిందే. సూపర్ 12లో అన్యూహంగా నెదర్లాండ్ చేతిలో పటిష్టమైన సౌతాఫ్రికా ఓడిపోవడంతో పాకిస్థాన్‌కు సెమీస్ బెర్త్ దక్కింది.
ఇక సెమీస్‌లో పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఓడించిన పాకిస్థాన్ ఫైనల్ చేరింది. రెండో సెమీస్‌లో ఇంగ్లండ్.. ఇండియాపై విజయం సాధించి ఫైనల్ చేరింది. పాకిస్థాన్ కూడా గతంలో ఒక సారి టీ20 వరల్డ్ కప్‌ను గెలిచిన విషయం తెలిసిందే. దీంతో రెండో కప్ కోసం పాక్-ఇంగ్లండ్ పోటీ పడ్డాయి. ఈ పోటీలో ఇంగ్లండ్ పూర్తి ఆధిప్యతం కనబర్చి.. ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కేవలం 137 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్కోర్‌ను కాపాడుకునేందుకు పాకిస్థాన్ బౌలర్లు తీవ్రంగానే శ్రమించినా.. పటిష్టమైన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ ముందు పాక్ బౌలింగ్ పవర్ సరిపోలేదు. పైగా.. వారి మెయిన్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదీ గాయం కారణం డెత్ ఓవర్స్‌లో బౌలింగ్ చేయకపోవడం కూడా పాక్‌కు నష్టం చేసింది.
అయితే.. పాకిస్థాన్ టోర్నీ ఆరంభంలో ఇండియా, జింబాబ్వే చేతుల్లో ఓడి దాదాపు ఇంటికి వెళ్లే పరిస్థితి తెచ్చుకుంది. ఈ సమయంలో పాక్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిసింది. ఇదో చెత్త టీమ్ అని, జట్టులోని ఆటగాళ్లు వరల్డ్ కప్ గెలిచేందుకు పనికిరారని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు సైతం తిట్టిపోశారు. ముఖ్యంగా పాకిస్థాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ పాక్ టీమ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించాడు. పాకిస్థాన్ ఇంటికి వచ్చేస్తుందని తనకు ముందే తెలుసని జింబాబ్వేతో ఓటమి తర్వాత చెప్పాడు. కానీ.. అదృష్టం కొద్ది పాక్ సెమీస్ చేరడం న్యూజిలాండ్‌పై గెలవడంతో కప్పు కొట్టనంత సంతోష పడి.. పాక్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. పనిలో పనిగా సెమీస్‌లో ఓడిన ఇండియాపైన కూడా విమర్శలు చేశాడు. కానీ.. ఫైనల్లో పాక్ బోల్తాకొట్టడంతో ఏం పర్వాలేదు.. ఈ కప్ పోతే పోయిందేలే కానీ.. వచ్చే ఏడాది 2023లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌ను గెలుద్దామని బాబర్ సేనకు భారీ టార్గెటే ఇచ్చాడు.
Dil dukha hai lekin, toota toh nahi hai. pic.twitter.com/E9fFbpECZe
— Shoaib Akhtar (@shoaib100mph) November 13, 2022