క్రికెట్ నిర్వహణకు కరోనా శాపంగా మారింది. దీని వల్ల సిరీస్‌కు సిరీస్‌లే వాయిదా పడుతున్నాయి. తాజాగా పాకిస్తాన్-వెస్టిండీస్ మధ్య జరగాల్సిన మూడు వన్డేల సిరీస్ వాయిదా పడింది. గురువారం వెస్టిండీస్ క్యాంప్‌లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో పాక్-వెస్టిండీస్ క్రికెట్ బోర్డులు సమావేశం అయి వన్డే సిరీస్‌ను వాయిదా వేసుకున్నాయి.
పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టు ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లను ఆడేసింది. మూడో మ్యాచ్ ఈ రోజు(శుక్రవారం) జరగనుంది. గురువారం కరోనా వెస్టిండీస్ క్యాంప్‌లో కరోనా కేసులు బయటపడ్డంతో టీ20 సిరీస్ తర్వాత జరగాల్సిన వన్డే సిరీస్ వాయిదా పడింది. కరోనా కారణంగా క్రికెట్ మ్యాచ్‌లు రద్దు, వాయిదా అవుతుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.