Pakistan Squad For T20 World Cup 2022: దాయాది పాకిస్తాన్.. టీ20 ప్రపంచకప్-2022కు జట్టును ప్రకటించింది. దాదాపు ఆసియా కప్ టోర్నీలో పాల్గొన్న ఆటగాళ్లనే మరోసారి కొనసాగించింది. ఎంపిక చేసిన 15 మందిలో ఆసియా కప్ లో విఫలమైన ఫకార్ జమాన్ కుచోటు దక్కకపోగా, గాయంతో టోర్నీలో దూరమైనా షాహీన్ అఫ్రిది తిరిగి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక, సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు మరో అవకాశమిస్తుందని వార్తలొచ్చినా.. కనీసం స్టాండ్ బై ఆటగాడిగా కూడా ఎంపిక చేయలేదు.
పాక్ టీ20 ప్రపంచ కప్ జట్టు విషయానికి వస్తే.. 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టుతో పాటు.. స్టాండ్ బైగా ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేశారు. గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిదీ, టీ20 వరల్డ్ కప్ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ సమయానికి అతను కోలుకుంటాడా? లేదా? అన్న సందేహాలు రేగినా అతను వేగంగా కోలుకోవడంతో వచ్చే నెలలో జరిగే పొట్టి ప్రపంచకప్‌లో బరిలో దిగుతాడని స్పష్టం చేసింది పాకిస్తాన్. ఇక, ఫఖర్ జమాన్ ను ప్రధాన జట్టుకు ఎంపిక చేయకపోగా.. రిజార్వ్ జాబితాలో చోటు కల్పించారు.
దీంతో పాటు స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరగనున్న టీ20 సిరీస్ కు జట్టును ఎంపిక చేశారు.. సెలెక్టర్లు. ఇందుకు 18 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ సిరీస్ కు బాబర్ ఆజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ ఆలీ, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్(కీపర్) వంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు అమీర్ జమీల్, అర్బర్ ఆహ్మద్, మహ్మద్ హారిస్ వంటి యువ ఆటగాళ్లకు పాక్ జట్టులో తొలిసారి చోటు కల్పించారు.
టీ20 ప్రపంచ కప్ కు పాకిస్తాన్ జట్టు:
బాబర్ ఆజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ ఆలీ, అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్(కీపర్), మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది మసూద్, ఉస్మాన్ ఖాదిర్.
స్టాండ్ బై ప్లేయర్స్: ఫకార్ జమాన్, మహ్మద్ హరీస్, షానవాజ్ దహానీ.
Introducing our squad 🙌
🗒️ https://t.co/JnHpDOvXsS#T20WorldCup | #BackTheBoysInGreen pic.twitter.com/BbmTdtBfhk
— Pakistan Cricket (@TheRealPCB) September 15, 2022