‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’ సంబరం మొదలైపోయింది. వార్మప్ మ్యాచ్‌లలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వట్టి టాప్ జట్టులను మట్టికరిపించి టీమిండియా మంచి జోష్‌లో ఉంది. ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే ఈ సంవత్సరం కప్పు కొట్టడం ఖాయమని అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. మరోవైపు సూపర్ 12లో మొదటి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌తో తలపడుతుండటం టీమిండియా అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తోంది. దాదాపు రెండేళ్ల తర్వాత ఇలా తలపడటం కూడా మంచి కిక్ ఇచ్చే అంశమే. టీమిండియా ప్రదర్శనతో దూసుకెళ్తుంటే పాకిస్తాన్ మాత్రం స్టేట్‌మెంట్లు పాస్ చేయడంపైనే తమ దృష్టంతా ఉంచింది. పీసీబీ ఛైర్మన్ దగ్గరి నుంచి మాజీ క్రికెటర్ల వరకు అందరూ టీమిడియాకు సవాళ్లు విసిరేవారే తప్ప ప్రదర్శన చేసేటట్లు కనిపిచండం లేదు.
ఇదీ చదవండి: సెక్యూరిటీ గార్డ్ కొడుకు కోటీశ్వరుడయ్యాడు.. అమితాబ్ నే ఆశ్చర్యపరిచిన కంటెస్టెంట్..
తాజాగా అభిమానులతో ఇంటర్యాక్ట్ అయిన పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ పలు వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు భారత్‌దే పైచేయి కదా.. అది మళ్లీ పునరావృతం అవుతందా అని అడిగిన ప్రశ్నకు బాబర్ ఆజమ్ స్పందించాడు. ‘గతం గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. అది జరిగిపోయింది. దానిని మేము మార్చలేము. మేము జరగబోయే దాని గురించే ఆలోచిస్తున్నాం. చరిత్రను తిరగరాయబోతున్నాం’ అంటూ గట్టిగానే ప్రగల్భాలు పలికాడు. బాబర్ ఆజమ్ ఎంత చెప్పినా కూడా పాక్ అభిమానులు మాత్రం మనం గెలుస్తామా అనే అనుమానాన్నే పదే పదే వ్యక్త పరిచారు. బాబర్ ఆజమ్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా పలు సెటైర్లు వేశారు. ‘చరిత్ర తిరగరాయడం కాదు.. చరిత్రే మళ్లీ రిపీట్ అవ్వుద్ది’ అంటూ బాబర్ ఆజమ్‌ను ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ఆటగాళ్లు కామెంట్లు మాని ప్రాక్టీస్ చేయాలి అని వస్తున్న కామెంట్లలపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.