పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక మ్యాచ్‌లో ఛాంపియన్‌లా ఆడే పాక్.. ఆ వెంటనే తర్వాతి మ్యాచ్‌లో పసికూన కంటే దారుణ ప్రదర్శనను కనబరుస్తుంది. నిలకడలేమికి మారు పేరుగా నిలిచేది పాకిస్థాన్. అలాంటి టీమ్ 2022లో కాస్త నిలకడైన ప్రదర్శన కనబర్చిందనే చెప్పాలి. ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్స్ ఆడింది పాక్. కప్పు గెలవలేకపోయినా.. ఫైనల్స్ వెళ్లి మెరుగైన ప్రదర్శనే కనబర్చింది. కానీ.. ఒక్క విషయంలో మాత్రం పాకిస్థాన్ 2022 ఏడాదికి మాత్రం చెత్త టీమ్‌గా నిలిచింది. చివరికి బంగ్లాదేశ్ కంటే దారుణంగా టాప్ 9 టీమ్స్‌లో తొమ్మిదో స్థానంలో
నిలిచింది.
కొన్నేళ్ల క్రితం వరకు పాకిస్థాన్ టీమ్ బలం పేస్ బౌలింగ్. వకార్ యూనిస్, వసీమ్ అక్రమ్, షోయబ్ అక్తర్, అమీర్, అబ్దుల్ రజాక్, ఉమర్ గుల్‌లు పేస్ బౌలింగ్ విభాగంగాలో పాక్‌ను పటిష్టమైన టీమ్‌గా నిలిపారు. ప్రస్తుతం కూడా షాహిన్ షా అఫ్రిదీ, హరీస్ రౌఫ్ లతో పాక్ పేస్ ఎటాక్ బలంగానే ఉన్నా.. 2022 ఏడాదిలో టెస్టు క్రికెట్‌లో ఆ టీమ్ పేస్ బౌలర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా 5 వికెట్ల హాల్ సాధించలేకపోయారు. పైగా ఈ ఏడాది పాకిస్థాన్ ఇప్పటి వరకు 9 టెస్టులు ఆడగా.. వారి పేసర్లు తీసిన వికెట్లు కేవలం 45. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టులో కూడా పాక్ పేసర్లు 5 వికెట్ల హాల్ సాధించేలా లేరు. మ్యాచ్ కూడా ఫలితం తేలకుండా ముగిసేలా ఉంది.
ఇలా టెస్టు క్రికెట్‌లో ఒక ఏడాది మొత్తం మీద ఒక్క పేసర్ కూడా 5 వికెట్ల హాల్ సాధించకపోవడం చాలా చెత్త రికార్డే. బంగ్లాదేశ్ పేసర్లు సైతం రెండు 5 వికెట్ల హాల్ సాధించడం గమనార్హం. ఈ ఏడాదిలో ఇంగ్లండ్ పేసర్లు 4, న్యూజిలాండ్ 4, ఆస్ట్రేలియా 3, ఇండియా 3, సౌతాఫ్రికా 3, బంగ్లాదేశ్ 2, వెస్టిండీస్ 2 సార్లు 5 వికెట్ల హాల్ సాధించారు. అసలు ఒక్క పేసర్ కూడా 5 వికెట్లు హాల్ సాధించని టాప్ 9లో ఏకైక టీమ్ పాకిస్థాన్. అయితే.. షాహిన్ షా అఫ్రిదీ, హరీస్ రౌఫ్ టెస్టులు ఆడకపోవడం కూడా పాకిస్థాన్‌కు ఈ చెత్త రికార్డు దక్కడంలో కారణమైంది. అయితే.. ఆస్ట్రేలియాతో మొత్తం మూడు టెస్టులు ఆడిన పాకిస్థాన్ 0-1తో ఓడింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తోనూ 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది. మరి పాకిస్థాన్ పేరిట నమోదైన ఈ చెత్త రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A year to forget for Pakistan fast bowlers in Test cricket. pic.twitter.com/zU98aBJDcs
— Johns. (@CricCrazyJohns) December 29, 2022