చాలాకాలం తర్వాత పాకిస్థాన్, భారత జట్టుపై గెలిచింది. అది కూడా ఆసియాకప్ లో.. దీంతో దాయాది జట్టు క్రికెటర్లు ఆనందం పట్టలేకపోయారు. అరిచి గోల చేసినంత పనిచేశారు. ఇంకా చెప్పాలంటే రచ్చ రచ్చ చేశారు. డ్రస్సింగ్ రూమ్ లో వాళ్లు చేసిన గోలకు సంబంధించిన వీడియోని పాక్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ వీడియో చూస్తే చాలు.. పాక్ క్రికెటర్లు ఎంత టెన్షన్ పడ్డారో అర్థమవుతుంది. మన బౌలర్ అర్షదీప్ చివరి ఓవర్ బౌలింగ్ చేస్తున్న టైమ్ లో విభిన్న హావభావాలు ప్రదర్శించారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. దుబాయిలో జరుగుతున్న ఆసియాకప్ లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్టుని ఓడించింది. ఆ తర్వాత హాంకాంగ్ జట్టుని కూడా ఓడించేసి, సూపర్ 4కి అర్హత సాధించింది. ఫలితంగా మరోసారి టీమిండియా-పాక్ మధ్య మ్యాచ్. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. భారత జట్టు మరోసారి గెలిచేస్తుందని ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఒత్తిడి ఎక్కువ కావడంతో పాటు చిన్న చిన్న తప్పిదాలు జరగడంతో మన జట్టు ఓడిపోయింది. ఇక చానాళ్ల తర్వాత భారత్ పై గెలిచేసరికి పాక్ ఆటగాళ్లు రచ్చ రచ్చ చేశారు. ఇక థ్రిల్లింగ్ గా సాగిన చివరి ఓవర్ లో అయితే గోళ్లు కొరుక్కున్నంత పనిచేశారు.
అర్షదీప్ వేసిన ఆ ఓవర్ లో.. తొలి బంతికి ఒక పరుగు రాగా, రెండో బంతికి అసిఫ్ అలీ ఫోర్ కొట్టాడు. మూడో బంతి డాట్ బాల్ పడింది. నాలుగో బంతికి అసిఫ్.. ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఐదో బంతికి ఇఫ్తికర్.. రెండు పరుగులు చేయడంతో పాక్ జట్టు గెలిచేసింది. ఈ ఓవర్ పడిన సమయంలో డ్రస్సింగ్ రూమ్ లోని పాక్ ఆటగాళ్లు బాబర్ ఆజామ్, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, హరీశ్ రవూఫ్ లాంటి తెగ టెన్షన్ పడిపోయారు. గెలుస్తామా లేదా అనుకున్న మ్యాచ్ గెలిచేసరికి ఆనందం పట్టలేకపోయారు. రచ్చ రచ్చ చేశారు. ఈ వీడియో పాక్ జట్టు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక అన్నీ కలిసొస్తే.. ఆసియాకప్ ఫైనల్లో భారత్-పాక్ తలపడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: టీమిండియాతో మ్యాచ్ అంటే మాకు భయం లేదు: పాక్ క్రికెటర్ రిజ్వాన్
The raw emotions, the reactions and the celebrations 🤗
🎥 Relive the last over of Pakistan’s thrilling five-wicket win over India from the team dressing room 👏🎊#AsiaCup2022 | #INDvPAK pic.twitter.com/xHAePLrDwd
— Pakistan Cricket (@TheRealPCB) September 4, 2022