దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న సంగతి తెలిసిందే. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. వంట గ్యాస్, గోధుమ పిండి ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా పాక్‌లో అంధకారం నెలకొంది. మరోవైపు విదేశీ మారక నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో దిగుమతులపై భారం పడుతోంది. డాలర్‌తో పాక్ రూపాయి మారకం విలువ రూ. 255కు చేరింది. దీంతో పాక్.. శ్రీలంక తరహాలో దివాళా తీయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా పాక్ సీనియర్ క్రికెటర్ వహాబ్ రియాజ్‌ను క్రీడా మంత్రిగా నియమించింది.
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుగా ఉన్న పంజాబ్ ప్రావిన్స్ లోని రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలోనే రద్దు చేసిన షెహబాజ్ ప్రభుత్వం.. అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా, అక్కడి గవర్నర్ బలిగ్ ఉర్ రెహ్మాన్ ఈ ప్రభుత్వంలో తాత్కాలికంగా ఓ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పాక్ సీనియర్ పేసర్ వహాబ్ రియాజ్ కుక్రీడా శాఖ మంత్రిగా పదోన్నతి కల్పించారు. అయితే, వహాబ్ రియాజ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. అందుకు కారణం.. అతడు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో ఆడుతున్నాడు. బీపీఎల్‌లో ఖుల్నా టైగర్స్ తరఫున ఆడుతున్న రియాజ్.. నేడో రేపో స్వదేశానికి వెళ్ళాక మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
🚨🚨🚨
News Alert!
Wahab Riaz Will be The New Sports Minister In The Caretaker Government of Punjab. #ICC #cricketnews #cricket #WahabRiaz #PCB pic.twitter.com/p5L1HAZqOo— CricCircle (@thecriccircle) January 27, 2023
వాహబ్ రియాజ్ చివరిసారిగా 2020లో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. పాక్ తరుపున 27 టెస్టులు, 92 వన్డేలు, 36 టీ20లు ఆడిన రియాజ్.. టెస్టుల్లో 83 వికెట్లు, వన్డేల్లో 120 వికెట్లు, టీ20ల్లో 38 వికెట్లు పడగొట్టాడు. అలాగే 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాకిస్థాన్ జట్టులో రియాజ్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే 2020 తర్వాత మాత్రం పాక్ జట్టులో చోటు సంపాదించుకోలేక పోయాడు. నాటి నుంచి టీ20 లీగ్స్ లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్న రియాజ్ మొత్తంగా 400 వికెట్లకు పైగా తీశాడు. ప్రస్తుతం బీపీఎల్ లో ఖుల్నా టైగర్ తరఫున ఆడుతున్న రియాజ్ తొమ్మిది వికెట్లు తీశాడు.
వచ్చే మూడు, నాలుగు నెలల్లో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగనందున.. అప్పటివరకు రియాజ్ ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు, మేథావులు వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. సంక్షోభం చుట్టుముడుతున్న వేళ ఇలాంటి నిర్ణయాలు ప్రజలకు, ప్రభుత్వానికి మరింత హాని చేస్తాయని కామెంట్స్ వినిపిస్తున్నారు. ఏది ఏమైనా పాక్ ఆర్థిక సంక్షోభం వేళ రియాజ్ కు మంత్రి పదవి దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంక్షోభం వేళ.. అందుబాటులో లేని ఒక క్రికెటర్‌ను క్రీడా మంత్రిగా నియమించడం సరైన నిర్ణయమా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Wahab riaz first day at office as a Sports minister pic.twitter.com/Tbd7Mw9PkY
— Teto Patiyaa 🇵🇰 (@Pola_620) January 27, 2023