పాపం పాకిస్థాన్. అసలే ఏ జట్టు కూడా తన దేశానికి రావడానికి పెద్దగా ఇష్టపడట్లేదు. ఇలాంటి టైంలో బీసీసీఐ దెబ్బకు మైండ్ బ్లాంక్ అయిపోయే షాక్ తగిలింది. ప్రస్తుతం అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
అసలే పాక్ క్రికెటర్లని ఎవడూ దేకట్లేదు! ఐసీసీ టోర్నీల్లో తప్పితే పెద్ద జట్లతో సరిగా సిరీసులు కూడా జరగట్లేదు. ఇలాంటి టైంలో పుండు మీద కారం చల్లినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డుకి మరో స్ట్రోక్ తగిలింది. బీసీసీఐ దెబ్బకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. దీంతో ఏం చేయాలో తెలీని అయోమయ స్థితిలో పాక్ బోర్డు పడిపోయింది. ప్రస్తుతం ఈ విషయమే క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది? పాక్ క్రికెట్ కు తగిలిన ఆ షాక్ ఏంటో తెలియాలంటే స్టోరీ ఫుల్ గా చదివేయండి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే చాలు క్రికెట్ ఫ్యాన్ అయిన ప్రతిఒక్కడూ తెగ ఇంట్రెస్టింగ్ గా చూస్తాడు. ఈ ఏడాది కూడా ఆసియాకప్, వన్డే వరల్డ్ కప్ టోర్నీలు ఉండటంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. వన్డే వరల్డ్ కప్.. మన దేశంలోనే అక్టోబరు-నవంబరులో జరగనుంది. దీని గురించి ఎవరికీ పెద్దగా అనుమానాల్లేవు. కానీ ఈ టోర్నీ కంటే కొన్నాళ్ల ముందు ఆసియాకప్ జరగనుంది. దీనికి ఈసారి పాక్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ పాక్ బోర్డు నుంచి అది ఇప్పుడు చేజారిపోయినట్లు తెలుస్తోంది.
ఆసియాకప్ పాక్ లో జరిగితే భారత జట్టుని పంపేది లేదని బీసీసీఐ ఖరాఖండీగా చెప్పేసింది. ఇదే జరిగితే తాము వరల్డ్ కప్ లో ఆడేది లేదని పాక్ చెప్పుకొచ్చింది. ఒకవేళ పాక్ అలా చేస్తే ఆ జట్టుకే నష్టం. ఇప్పుడు దీనిపై మరో షాక్ అన్నట్లు.. పాక్ బోర్డు ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనని సభ్యదేశాలు తిరస్కరించాయి. హైబ్రిడ్ మోడల్ అంటే.. భారత్, పాక్ ఓ గ్రూప్ లో ఉంటే మరో జట్టు పాక్-యూఏఈలో మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. దీనివల్ల ప్లేయర్లకు చాలా కష్టమవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా భేటీ అయిన ఆసియా క్రికెట్ కౌన్సిల్.. ఆసియాకప్ ని శ్రీలంకలో జరిపే ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం మరోసారి చర్చింది.. దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తారు. ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే మాత్రం పాక్ కి ఘోర అవమానం జరిగినట్లే! మరి దీనిపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
As per Indian Express, defending champions Sri Lanka will defend their title at home.#AsiaCup #INDvsPAK pic.twitter.com/7w3vyXJc8G
— CricTracker (@Cricketracker) May 8, 2023