యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ మరో రెండు రోజుల్లో జరగనుంది. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎవరికి వారు విజయం తమదే అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్.. అదే టెంపును కొనసాగించాలని పాకిస్థాన్ భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో అనే విషయంపై చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం స్పందించి తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
అలాగే ఇండియా-పాకిస్థాన్ జట్లను గాయాల పెడద వేధిస్తోంది. రెండు టీమ్స్‌లోని నంబర్ వన్ బౌలర్లు బుమ్రా, షాహీన్ షా అఫ్రిదీ గాయాల కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యారు. పాక్ పేసర్ అఫ్రిదీ తమ జట్టులో లేకపోవడంపై పాకిస్థాన్ హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్ స్పందిస్తూ.. అతను లేకున్నా.. మిగతా ముగ్గురు పేసర్లు టీమిండియా టాపార్డర్ పనిపడతారని ధీమా వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడుతూ..‘మా ప్రధాన బౌలర్ షాహీన్ అఫ్రిదీ జట్టులో లేకపోయినా నసీమ్ షా, మహ్మద్ హస్నైన్, హరీస్ రౌఫ్ మంచి ప్రదర్శన కనబర్చగలరు. టీమిండియా టాపార్డర్‌ను ఈ ముగ్గురు బౌలర్లు వణికిస్తారు. వీరి ముగ్గురిపై మా కెప్టెన్ బాబర్ అజమ్‌కు, కోచ్‌గా నాకు పూర్తి నమ్మకం ఉంది. షాహీన్ అఫ్రిదీ ఉంటే పేస్ ఎటాక్‌కు నాయకత్వం వహించేవాడు. అతను లేకపోయినా.. మిగతా ముగ్గురు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ గతిని మార్చేయగల సమర్థులు.’ అని ముస్తాక్ పేర్కొన్నాడు.
గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో షాహీన్ అఫ్రిదీ టీమిండియా టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. కేఎల్ రాహుల్, రోహిత్ వర్మతో పాటు హాఫ్ సెంచరీతో నిలకడగా ఆడుతున్న విరాట్ కోహ్లీని అవుట్ చేసి భారత్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశాడు. కాగా.. శ్రీలంక-పాకిస్థాన్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో షాహీన్ అఫ్రిదీ మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అఫ్రిదీ ఆటకు దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో ఆసియా కప్ కోసం మొహమ్మద్ హుస్నైన్ అనే యువ పేసర్‌ను జట్టులోకి తీసుకున్నారు. హస్నైన్ ఇప్పటివరకు 18 టీ20 మ్యాచ్‌లు ఆడి 17 వికెట్లు తీసుకున్నాడు. మరో పేసర్ నసీమ్ షా భారత్‌తో జరిగే మ్యాచ్‌తోనే టీ20 క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. మరి పాకిస్థాన్ హెడ్ కోచ్ ముస్తాక్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: భారత్-పాక్ ఆటగాళ్లు గొడవపడతారని అనుకుంటారు! కానీ అదంతా..: సెహ్వాగ్
Saqlain Mushtaq “We have Naseem Shah, Mohammad Hasnain, and Haris Rauf who are capable of destroying any batting order” #Cricket #AsiaCup2022
— Saj Sadiq (@SajSadiqCricket) August 26, 2022
Pakistan head coach Saqlain Mushtaq has backed Haris Rauf, Naseem Shah and Mohammad Hasnain to deliver against India despite the absence of ‘left-arm’ angle of Shaheen Shah Afridi #AsiaCup2022 https://t.co/ERO4zY6SKT
— CricWick (@CricWick) August 25, 2022