ఐపీఎల్ తుది దశకు చేరుకుంది. అక్టోబరు 15న ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కేవలం రెండ్రోజుల వ్యవధిలోనే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐపీఎల్ సందర్భంగా అన్ని దేశాల ఆటగాళ్లకు యూఏఈలో ప్రాక్టీస్ అయినట్లే. ఇంగ్లాండ్, పాకిస్థాన్ లాంటి జట్లు వారి స్వదేశంలోనే సమాయత్తమవుతున్నారు. పాకిస్థాన్‌పై ఆడి పరువు పోగొట్టుకోవద్దు అంటూ తాజాగా ఆ దేశ మాజీ క్రికెటర్ రజాక్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖలను తీవ్రంగా ఖండించాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా. ఖండించడమే కాదు.. రజాక్‌కు బాగా గడ్డి కూడా పెట్టాడు.
రజాక్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ డానిష్ కనేరియా తన యూట్యూబ్ ఛానల్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ‘నేను ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు. ఒక అనలిస్ట్‌గా రాజక్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్తాను’ అంటూ డానిష్ కనేరియా సమాధానాలు చెప్పుకొచ్చాడు. ‘ఇప్పటికే అన్ని దేశాలు రెండు టీమ్‌లను తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికీ మీకు ఒక సరైన టీమ్ కూడా లేదు. మరెలా మీరు భారత్‌ను చిత్తుగా ఓడిస్తారు. అసలు ఒక అవగాహనతోనే ఇలా మాట్లాడావా? అంటూ డానిష్ ప్రశ్నించాడు. భారత్ బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ చూస్తే ఈసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీ సొంతం చేసుకునే స్థాయిలో వాళ్లున్నారు. పాకిస్థాన్ బౌలింగ్ లైనప్ సరిగ్గా లేకపోతే కనీసం రెండో రౌండ్‌కు కూడా చేరుకోలేరంటూ డానిష్ ఎద్దేవే చేశాడు. ‘ఈ సందర్భంగా అలా మాట్లాడటం సరైంది కాదు. ఇంగ్లాండ్ ‘బీ’ చేతిలో ఓడిపోయిన్ పాకిస్థాన్ భారత్‌ను చిత్తు చేస్తుందని భ్రమలో ఉన్నావు’ హితవు పలికాడు. ఇప్పుడు డానిష్ కనేరియా వ్యాఖ్యలు యూట్యూబ్‌లో వైరల్‌గా మారాయి. మరి ఆ వీడియోనూ మీరూ చూసేయండి. రజాక్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.