పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో.. ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితి కూడా అలాగే ఉంది. గత కొంతకాలంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో పరిస్థితి గందరగోళంగా ఉన్న విషయం తెలిసిందే. అన్ని ఫార్మాట్ లకు కెప్టెన్ గా ఉన్న బాబర్ అజామ్ పరిస్థితే ఆందోళన కరంగా ఉంది. జట్టులో అతని స్థానం కొనసాగుతుందో లేదో కూడా చెప్పే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో షోయబ్ మాలిక్ తన కెరీర్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. నాలుగు పదుల వయసులోనూ తాను క్రికెట్ కు రిటైర్మెంట్ చెప్పే పరిస్థితి లేదంటూ వ్యాఖ్యానించాడు. తాను ఇంకా 25 ఏళ్ల కుర్రాడితో పోటి పడేలా ఫిట్ గా ఉన్నానంటూ కామెంట్ చేశాడు.
షోయబ్ మాలిక్ గొప్ప క్రికెటర్ అనడంలో ఎవరికీ సందేహం లేదు. పాకిస్థాన్ క్రికెట్ సక్సెస్ లో షోయబ్ మాలిక్ కూడా కీలకపాత్ర పోషించాడు. ఇప్పటికీ ఫ్రాంచైజీల తరఫున క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. జాతీయ జట్టులో అవకాశం దక్కకపోతుందా అనే ఆశాభావంతో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఉన్న కుర్రాళ్లకే అవకాశాలు దక్కడం కష్టంగా ఉంటే.. తాను మాత్రం ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటానంటున్నాడు. నాలో ఇంకా కసి అలాగే ఉందంటూ చెబుతున్నాడు. తాజాగా అతను రిటైర్మెంట్ విషయంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
– “You can compare my fitness with a 25 year old. What motivates me is I still enjoy coming to the ground & I still think that the hunger is there. As long as these two things are there, I am going to keep playing, which is why I am not even thinking of retiring.” #ShoaibMalik pic.twitter.com/UZ4BdnaAA5
— Arsalan H. Shah (@arsalanhshah) January 29, 2023
“నేను ఇప్పటికీ మైదానికి వెళ్తున్నాను. నాలో ఇంకా ఆడాలనే కసి చచ్చిపోలేదు. మీరు కావాలంటే నా ఫిట్ నెస్ ని 25 ఏళ్ల కుర్రాడితో పోల్చి చూసుకోవచ్చు. నేను క్రికెట్ ఆడుతూనే ఉంటాను. అందుకే నేను నా రిటైర్మెంట్ గురించి అసలు ఆలోచన కూడా చేయడం లేదు. నేను ఇప్పటికే టెస్టు, వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలికాను. కానీ, టీ20కి మాత్రం వీడ్కోలు పలికే ఉద్దేశం లేదు. నేను ఇంకా అందుబాటులోనే ఉన్నాను. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచిస్తున్నాను. నా జీవితంలో చాలా చూశాను.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో జరుగుతున్న విషయాలు నా క్రికెట్ పై ప్రభావం చూపలేవు” అంటూ షోయబ్ మాలిక్ వ్యాఖ్యానించాడు.
Shoaib Malik’s six went into Warner’s home 😛#Shoaibmalik #PSL8 #Cricketpic.twitter.com/DDhXiACzue
— Muhammad Noman (@nomanedits) January 21, 2023
ఈ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే.. అతను 1999లో వెస్టిండీస్ మీద తన వన్డే కెరీర్ ని ప్రారంభించాడు. మొత్తం 287 వన్డే మ్యాచ్ లు ఆడిన షోయబ్ మాలిక్ 34.55 బ్యాటింగ్ సగటుతో 7,534 పరుగులు చేశాడు. 35 టెస్టులు ఆడిన మాలిక్ 35.14 బ్యాటింగ్ సగటుతో మొత్తం 1898 పరుగులు చేశాడు. ఇంక టీ20ల్లో షోయబ్ మాలిక్ సంచలనం అని చెప్పాలి. 124 మ్యాచుల్లో 125.64 స్ట్రైక్ రేట్ తో 2435 పరుగులు చేశాడు. మాలిక్ ఎంతో గొప్ప క్రికెటర్ అయిన కూడా ఇలాంటి పరిస్థితుల్లో అతనికి పాకిస్థాన్ తరఫున ఆడే అవకాశం దక్కుతుందని ఎవరూ నమ్మడం లేదు. కానీ, షోయబ్ మాలిక్ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అభిమానులు మెచ్చుకుంటున్నారు.
41-year-old Shoaib Malik taking catches with ease💥#Shoaibmalik #BPL2023 #HBLPSL8 pic.twitter.com/7bCuG5BtkP
— Muhammad Noman (@nomanedits) January 27, 2023