ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. శనివారం(సెప్టెంబర్ 24)న ఈ రెండు జట్ల మధ్య చివరి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 45.4 ఓవర్లలోనే 169 పరుగులకే కుప్పకూలింది. స్మృతి మంధాన(50), దీప్తి శర్మ(68), పూజ(28) మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ను సైతం టీమిండియా బౌలర్లు పరుగులు చేయనియలేదు. 118 పరుగులకే 9 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను ఓటమి అంచులకు తీసుకొచ్చారు. కానీ.. చార్లీ డీన్(47) పోరాటంతో ఇంగ్లండ్ విజయం సాధించేలా కనిపించింది.
ఇన్నింగ్స్ 44వ ఓవర్‌లో మ్యాచ్ ఊహించని విధంగా ముగిసింది. ఇంగ్లండ్ విజయానికి 40 బంతుల్లో 16 మాత్రమే కావాలి. చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉంది. 44వ ఓవర్ వేసేందుకు వచ్చిన దీప్తి శర్మ.. మూడో బంతిని వేసేందుకు సిద్ధమైంది. బాల్ రిలీజ్ చేసే టైమ్‌కు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న చార్లీ డీన్ క్రీజ్ వదిలి వెళ్లడం గమనించిన దీప్తి బాల్‌ను రిలీజ్ చేయకుండా నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న వికెట్లను గిరాటేసింది. రూల్స్ ప్రకారం అంపైర్ డీన్‌ను రనౌట్‌గా ప్రకటించడంతో 153 పరుగుల వద్ద తమ చివరి వికెట్‌ను కోల్పోయి మ్యాచ్ ఓడిపోయింది. దీంతో టీమిండియా 3-0తో వన్డే సిరీస్‌ను కైవలం చేసుకుంది.
కాగా దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదస్పదమైంది. భారత్ ఆటగాళ్లు అనైతికంగా ఆడారని ఇంగ్లండ్ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. కానీ.. మేము పక్కా రూల్స్ ప్రకారమే రనౌట్ చేశామని. అలా చేసే ముందు డీన్‌ను హెచ్చరించామని, బాల్ రిలీజ్ కాకముందే ఆమె క్రీజ్ వదిలి చాలా దూరం వెళ్తుందని అంపైర్‌కు కూడా చెప్పినట్లు భారత ఆటగాళ్లు వెల్లడించారు. ఈ విషయంపై ఇంగ్లండ్-భారత్ క్రికెటర్లు, ఫ్యాన్స్ మధ్య వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో.. తగుదునమ్మా అంటూ పాకిస్థాక్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు మధ్యలో దూరి అతి చేస్తున్నారు. ఇంగ్లండ్‌లో భారత్-ఇంగ్లండ్ మహిళా జట్లు మధ్య వన్డే సిరీస్ జరగుతున్న సమయంలోనే పాకిస్థాన్-ఇంగ్లండ్ పురుషుల జట్లు పాకిస్థాన్‌లో తలపడుతున్నాయి.
పాక్‌తో జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు చేతిలో మూడు వికెట్లు ఉన్నా 10 బంతుల్లో 5 పరుగులు చేయలేక పోడిపోతుంది. 5 బంతుల్లో 4 పరుగులు చేయాల్సిన దశలో ఇంగ్లండ్ బ్యాటర్ టోప్లీని పాక్ ఆటగాళ్లు రనౌట్ చేసి మ్యాచ్‌ను గెలుస్తారు. రెండు ఓవర్లలో 9 పరుగులు డిఫెండ్ చేసిన పాక్ ఆటను అంతా మెచ్చుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన మన్కడింగ్ రనౌట్‌ను, టోప్లీ రనౌట్‌తో పోల్చుతూ.. అతి చేస్తున్నారు. తామెంతో కష్టపడి నిజాయితీ రనౌట్ చేసి మ్యాచ్‌ను గెలిచామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. రెండు దేశాల మధ్య ఇదే తేడా అంటూ వివాదాస్పద ట్వీట్లు చేస్తున్నారు. ఈ ట్వీట్లకు ఇండియన్ క్రికెట్ అభిమానులు కూడా ధీటుగా బదులిస్తూ పాక్ ఫ్యాన్స్‌కు బుద్ధిచెబుతున్నారు. రూల్స్ గురించి మీ తెలియదు.. అందుకే ఇలా అజ్ఞానంతో మాట్లాడుతున్నారు అంటూ కౌంటర్ ఇస్తున్నారు.
Reason why Quaid seperated them. pic.twitter.com/Lhb178URm2
— Dennis (@DennisCricket_) September 26, 2022
ఇది కూడా చదవండి: ఆ భారత బ్యాటర్ కు తగ్గ బౌలింగ్ మా దగ్గర లేదు: ఆసీస్ కోచ్