క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లకు ఎంతో గౌరవం ఉంటుంది. ఈ క్రమంలోనే తమపై ఉన్న నమ్మకాన్ని ఒక్క సారి సదరు ఆటగాడు కోల్పోతే అతడి కెరీర్ దాదాపుగా ముగిసినట్లే. ఇక ఆటగాళ్లకు డబ్బు ఆశ చూపి కోందరు బుకీలు తమ బుట్టలో వేసుకున్న సందర్భాలు మనం చాలానే చూశాం. అదీ కాక మరికొందరు ఆటగాళ్లు డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ సంఘటనలూ మనకు తెలుసు. అయితే ఈ క్రమంలోనే అవినీతికి సంబంధించిన పలు ఆరోపణలు ఎదుర్కొంటూ.. తాజాగా 35 ఏళ్ల ఓ క్రికెటర్ నిషేధానికి గురైన సంఘటన క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అవినీతి కేసులను విచారిస్తున్న బోర్డుకు ఆ ఆటగాడి తాలుకు విషయాలు తెలియడంతో అతడిని సస్పెండ్ చేసింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అసిఫ్ అఫ్రిది.. ఖైబర్ కనుమలకు చెందిన 35 ఏళ్ల ఎడమ చేతి వాటం స్పిన్నర్. ఇతడిపై అవినీతి ఆరోపణలు కారణంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. దీంతో అతడు రాబోయే అన్నీ టోర్నీలకు దూరం కానున్నాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రాజ్యంగ ఆర్టికల్ 4.7.1 కింద అతడిని సస్పెండ్ చేసింది. అయితే ఈ నిషేధానికి సంబంధించి అతడికి బోర్డు 14 రోజుల గడువును ఇచ్చింది. 14 రోజులలోపు అసిఫ్ అఫ్రిదీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అసిఫ్ గతంలో జాతీయ టీ20 కప్ లో రావల్పిండి జట్టు తరపున ఆడాడు. అక్కడ అద్భుతమైన ప్రదర్శన చేయడంతో అతడికి ఆస్ట్రేలియా టూర్ కు ఛాన్స్ వచ్చింది. కానీ 11 మంది ఆటగాళ్లలో మాత్రం స్థానం దక్కలేదు. ఈ క్రమంలోనే అతడిపై సస్పెన్షన్ వేటు పడింది.
అయితే ఇటీవలి కాలంలో పాక్ బోర్డ్ అవినీతి ఆరోపణల కేసులను విచారిస్తుంది. అందులో భాగంగానే అసిఫ్ అఫ్రిదికి సంబంధించిన వివరాలను అతడు సరిగ్గా బోర్డ్ కు నివేదించలేదు. అదీ కాక మరో రెండు ఉల్లంఘనలను కూడా అతడు పాల్పడ్డట్లు బోర్డు తెలిపింది. అయితే ఇలా నిషేధానికి గురి కావడం పాక్ క్రికెటర్స్ కు కొత్తేమి కాదు. ఇటీవల PSL 2020 టోర్నీ ప్రారంభానికి ముందు తన పై వచ్చిన ఆరోపణలు నిజం కావడంతో ఉమర్ అక్మల్ పై నిషేధాన్ని బోర్డు విధించిన సంగతి మనకు తెలిసిందే. అదీ కాక 2017లో నవాజ్ పై 2 నెలల సస్పెన్షన్ ను విధించారు. PSL లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డ షార్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్ లను బోర్డ్ నిషేధించింది. ఈనేపథ్యంలో అసిఫ్ అఫ్రిది ఆటకు సంబంధించి ఏ కార్యక్రమాల్లో కూడా పల్గొనరాదు అని బోర్డు తెపింది. మరి నిషేధానికి గురైన అసిఫ్ అఫ్రిది పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The PCB has suspended Asif Afridi under its anti-corruption code, after charging the Khyber Pakhtunkhwa left-arm spinner for two breaches including failing to report a corrupt approach
— ESPNcricinfo (@ESPNcricinfo) September 13, 2022