సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేస్తున్న ఆటగాడు. ‘స్కై’ అనే పేరు పెట్టినందుకు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా వారికి మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు. ప్రపంచంలోని మేటి బౌలర్లను సైతం గల్లీ బౌలర్లుగా మార్చేస్తున్నాడు. క్రీజులోకి వచ్చింది మొదలు ప్రతి బంతిని బౌండిరీకి పరిగెత్తించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నాడు. కొన్ని షాట్లు చూస్తే ఆ బంతిని కూడా సిక్సర్ కొట్టచ్చా అనే అనుమానం రాకమానదు. ఔటవుతానేమో? అనే భయం సూర్య బ్యాటింగ్‌లో గానీ, అతని కళ్లల్లో గానీ అస్సలు కనిపించదు. అదర్ ఎండ్‌లో బాల్‌ని ఆపడమే కష్టంగా భావించి సింగిల్స్ తీస్తుంటే.. సూర్య మాత్రం వచ్చిన మొదటి బంతినే సిక్సర్ కొట్టి చిరు నవ్వులు చిందుస్తుంటాడు. అయితే ఇప్పుడు సూర్య చెలరగేడం చూస్తుంటే పాకిస్థాన్‌కు గుండెలో రాయిపడినట్లు అయ్యింది.
సూర్యకుమార్ యాదవ్ ఇలాంటి భయంకరమైన ఫామ్‌లో ఉండటం పాకిస్థాన్‌కి ఏ మాత్రం మంచిది కాదనే చెప్పాలి. వాళ్లకి కూడా సూర్య కుమార్ యాదవ్ ఫామ్ చూసి నోట మాట రావడం లేదు. ప్రపంచకప్ నేపథ్యంలో వారికి ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితనే చెప్పాలి. ఎందుకంటే గాయాల కారణంగా షహీన్ షా లాంటి మంచి బౌలర్ దూరం కావడం ఆ జట్టుకు తీరని లోటనే చెప్పాలి. అంతేకాకుండా వాళ్లు ఇన్నాళ్లు కోహ్లీని ఎలా కట్టడి చేయాలి, రోహిత్ శర్మ కోసం ఏం ప్రణాళిక రచించాలి, పంత్, కేఎల్ రాహుల్ ఇలా వీళ్ల కోసం ఏవేవో ప్లాన్స్ గీసుకుంటుంటే ఇప్పుడు మధ్యలో సూర్య కుమార్ యాదవ్ వచ్చాడు. మనోడు కొట్టే షాట్లకు వాళ్ల దగ్గర సమాధానం లేదనే చెప్పాలి.
Milestone 🚨 – @surya_14kumar becomes the fastest batter to get to 1000 T20I runs in terms of balls (573) faced.#TeamIndia pic.twitter.com/iaFgAX8awu
— BCCI (@BCCI) October 2, 2022
ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్‌లో భారత్ తో తలపడేందుకు(అక్టోబర్ 23న మ్యాచ్) ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్‌ని కట్టడి చేయాలంటే పెద్ద వ్యూహమే రచించాలి. అది సాధ్యమయ్యే పరిస్థితిలా అయితే కనిపించడం లేదు. ఇటీవలే ఇంగ్లాండ్ చేతిలో 4-3 తేడాతో టీ20 సిరీస్‌ని కోల్పోయింది. బౌలర్లు మాత్రమే కాదు.. బ్యాటర్లు కూడా చాలా మ్యాచుల్లో అంత ప్రభావం చూపలేకపోయారు. గెలిచిన 3 మ్యాచుల్లో ఒక్కటి మాత్రమే 10 వికెట్ల తేడాతో గెలిచారు. మిగిలిన రెండు మ్యాచుల్లో 3 పరుగులు, 6 పరుగుల తేడాతో గెలిచారు. అంటే పాక్ బౌలర్లు అంత ప్రభావం చూపలేకపోయారనే చెప్పాలి. అందుకే ఇప్పుడు పాక్ టీమ్ గుండెల్లో గుబులు మొదలైంది. భారత్‌తో ఆడబోయే మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ వారికి తలనొప్పిగా మారతాడని వారికి బాగా తెలుసు.
Still thinking about Suryakumar Yadav’s shots from last night?
(via @BCCI) pic.twitter.com/CmtP5LoXmF
— ESPNcricinfo (@ESPNcricinfo) October 3, 2022
అంతేకాకుండా జట్టు పరంగానే కాదు.. అటు వ్యక్తిగతంగానూ పాకిస్తాన్ ఓపెనర్లను సూర్య భయపెడుతున్నాడు. అంతర్జాతీయ టీ20 ర్యాంకింగుల్లో మహ్మద్ రిజ్వాన్ తొలి ర్యాంకు, బాబర్ అజామ్ రెండోస్థానంలో ఉన్నారు. ఇప్పుడు సూర్య బాబర్‌ను ఒక స్థానం వెనక్కి నెట్టేసి 801 పాయింట్లతో ఐసీసీ ర్యాంకిగ్స్ లో రెండో స్థానానికి చేరుకున్నాడు. అంతేకాదు మహ్మద్ రిజ్వాన్‌కు కూడా కేవలం 60 పాయింట్ల దూరంలోనే ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్, టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో సూర్య ఇదే ఫామ్ కొనసాగిస్తే మహ్మద్ రిజ్వాన్ తొలిస్థానం కోల్పోయినా ఆశ్చర్యం వ్యక్తంచేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఐసీసీ టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్ లో టాప్ 10లో భారత్ నుంచి కేవలం సూర్య ఒక్కడే ఉంటడం విశేషం. సూర్య కుమార్ యాదవ్ తన భీకర ఫామ్‌తో పాకిస్థాన్ జట్టును మాత్రమే కాదు.. ఆ జట్టు కెప్టెన్, టాప్ బ్యాటర్‌ని కూడా తెగ భయపెడుతున్నాడు. ఒకరకంగా సూర్యకుమార్ యాదవ్ పాకిస్థాన్ జట్టుకి మొగుడు అయ్యాడనే చెప్పాలి.
Suryakumar Yadav continues his rich vein of form ahead of #T20WorldCup 2022 🔥
More records 👉 https://t.co/TIcQa58CB6#INDvSA pic.twitter.com/bHaXPzdjEQ
— ICC (@ICC) October 3, 2022
🥇 Most T20I runs in 2022
💥 Most T20I sixes in 2022
👊 Most T20I fours among full members in 2022Suryakumar Yadav is having that sort of year 🚀 pic.twitter.com/sqdIyDZ9eC
— ESPNcricinfo (@ESPNcricinfo) October 2, 2022