టీ20 వరల్డ్ కప్ 2021 సెమీస్‌లో ఓటమికి హసన్‌అలీనే కారణమని సోషల్ మీడియాలో అతన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అతని కుటుంబానికి బెదిరింపులు కూడా వస్తున్నాయి. అలాగే హసన్ అలీ భార్య సమీయా అర్జో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో బూతులు తిడుతూ కామెంట్లు చేస్తున్నారు. సమీయా భారతీయురాలు.. హసన్‌ను ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా భార్యతో కలిసి భారత్‌కు వెళ్లిపోవాలని, షియా ముస్లిమ్ అయినందునే నువ్వు క్యాచ్ వదిలేశావంటూ హసన్‌పై సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు పాక్ ఫ్యాన్స్.
విచిత్రంగా సన్‌కు ఇండియన్ ఫ్యాన్స్ సపోర్టుగా నిలుస్తున్నారు. ట్విట్టర్‌లో ‘ఇండియా విత్ హసన్‌అలీ’(#indwithhasanali) ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. కాగా ఇంతకు ముందు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో షమిపై కూడా ఇలాంటి సోషల్ ఎటాక్ జరిగింది. ఆ సమయంలో టీమిండియా మాజీ ఆటగాళ్లు, పాక్ ఓపెనర్ రిజ్వాన్ కూడా షమికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు పాక్ సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమికి హసన్ అలీ ఆసీస్ బ్యాట్స్‌మెన్ మ్యాథ్యూ వేడ్ క్యాచ్ ఓదిలేయడంతోనే పాక్ గెలవాల్సిన మ్యాచ్ ఓడిందంటూ పాక్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
కాగా ఆసీస్‌కు 10 బంతుల్లో 20 పరుగుల అవసరమైన దశలో షాహిన్ అఫ్రిదీ బౌలింగ్‌లో వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను హసన్ అలీ నేలపాలు చేశాడు. దాంతో బతికిపోయిన వేడ్ ఇక మరో చాన్స్ ఇవ్వకుండా.. క్యాచ్ డ్రాప్ అయిన బంతికి 2 పరుగులు తీసుకున్నాడు. ఇక 9 బంతుల్లో 18 కొట్టాలి… వరుసగా 6,6,6 మూడు సిక్సులు కొట్టి ఇంకో ఓవర్ ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు వేడ్. అంత ఒత్తిడిలో ఒక క్యాచ్ వదిలేయడంపై హసన్‌పై జరుగుతున్న సోషల్ ఎటాక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.