బాబర్ అజాం.. తనదైన ఆటతీరుతో క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అటు కెప్టెన్ గా కూడా పాకిస్తాన్ జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు. ఆట విషయంలో పాక్ ప్రజలు తప్పకుండా బాబర్ అజాంను మెచ్చుకోక మానరు. ఇప్పుడు బాబర్ తన మంచి మనసుతోనూ అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు. నెట్టింట బాబర్ చేసిన పనిపై సర్వత్రా ప్రశంసలు వెల్లివెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. నూహ్ దస్తగిర్ భట్ కామన్వెల్త్ క్రీడల్లో వెయింట్ లిఫ్టింగ్ విభాగంలో పాకిస్తాన్ తొలి స్వర్ణాన్ని తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాకిస్తాన్ మొత్తం నూహ్ దస్తగిర్ భట్ పేరు మారుమ్రోగుతోంది. పాక్ కు తొలి స్వర్ణం తెచ్చిపెట్టిన వెయిట్ లిఫ్టర్ కు పాక్ కెప్టెన్ బాబర్ అజాం రూ.20 లక్షలు(ఇండియన్ కరెన్సీలో రూ.7లక్షలు) నజారానా ప్రకటించాడు.
Roar Pakistan! 🔥 👏
Extremely proud of these superstars. All our athletes deserve proper structure, support and state-of-the-art facilities.#PakistanZindabad pic.twitter.com/XLOsusWzfo
— Babar Azam (@babarazam258) August 4, 2022
బాబర్ అజాం చేసిన ప్రకటన ఇప్పుడు అటు పాకిస్తాన్ లోనే కాకుండా ఇటు క్రికెట్ ప్రపంచంలోనూ అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు నూహ్ తన స్వర్ణాన్ని తన తండ్రికి అంకింతం చేస్తున్నానంటూ ప్రకటించాడు. తన తండ్రి కష్టం వల్లే ఇప్పుడు అతను కామన్వెల్త్ లో స్వర్ణం నెగ్గగలిగానని చెప్పాడు. అంతేకాకుండా ఇండియన్ లిఫ్టర్ మీరాబాయి చాను తనకు ఇన్‌స్పిరేషన్ అంటూ చెప్పుకొచ్చాడు. టోక్యోలో మీరాబాయి మెడల్ సాధించి ఆసియా దేశాల్లో స్ఫూర్తి నింపిందన్నాడు. బాబర్ నజారానా ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Pakistani Cricket Team Captain Babar Azam has announced to give PKR 2 Million reward to Nooh Dastagir Butt on winning first Gold Medal for Pakistan in the Commonwealth Games.
Nooh Dastagir Butt won first Gold Medal for Pakistan in the Commonwealth Games.🏅 pic.twitter.com/GAlUaeLNtS
— Wajiha Hilal (@Wajihahilal1) August 4, 2022