ఆసియా కప్ 2022లో భాగంగా హాంకాంగ్‌పై విజయం సాధించిన పాకిస్థాన్ అరుదైన రికార్డు సాధించింది. టీ20ల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన రెండో టీమ్‌గా పాక్ నిలిచింది. కాగా.. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. ఇప్పుడు పాకిస్థాన్ టీమిండియను వెనక్కునెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించింది. 2018లో భారత్.. ఐర్లాండ్‌పై 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టీ20ల్లో అత్యధిక తేడాతో విజయం సాధించిన జట్ల జాబితాలో రెండో ప్లేస్‌లో ఉండేది. కానీ.. పాకిస్థాన్ హాంకాంగ్‌ను 155 పరుగుల భారీ తేడాతో ఓడించడంతో టీమిండియా రికార్డ్ బ్రేక్ అయింది.
2007లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 172 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి మొదటి స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక తర్వాత పాక్, భారత్ రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆసియా కప్‌లో సూపర్ ఫోర్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్ చెలరేగింది. పసికూన హాంకాంగ్‌పై ప్రతాపం చూపింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(78 పరుగులు నాటౌట్), ఫఖర్ జమాన్(53), ఖుష్‌దిల్ షా(35) పరుగులతో రాణించారు. చివరి ఓవర్‌లో ఖుష్‌దిల్ షా నాలుగు సిక్సులతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో పాక్ భారీ స్కోర్ సాధించింది.
అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్ కాంగ్ దారుణంగా 38 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. మహ్మద్ నవాజ్ మూడు, నసీమ్ షా రెండు, దహినీ ఒక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో పాకిస్థాన్ సూపర్ ఫోర్‌కు చేరింది. ఇక సూపర్ ఫోర్‌లో భాగంగా రేపు(ఆదివారం సెప్టెంబర్ 4) భారత్-పాక్ మరోసారి తలపడనున్నాయి. మరి హాంకాంగ్‌పై పాకిస్థాన్ విజయం, టీమిండియా రికార్డ్ బ్రేక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పాక్‌పై తేలిపోయిన హాంకాంగ్! టీమిండియా బౌలర్లపై తీవ్ర విమర్శలు
Congratulations #Pakistan loved this ruthless cricket from @TheRealPCB it was missing from long time , well done by all the bowlers keep rocking green shirts #PAKvsHK pic.twitter.com/cEHESDBEgB
— K Asif (@kasif15) September 2, 2022