బౌన్సర్లు బౌలర్లకు బలం.. కొన్ని సార్లు బ్యాటర్లను భయపెట్టేందుకు కూడా బౌలర్లు బౌన్సర్లను సంధిస్తారు. కానీ.. పాక్ బౌలర్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి.. ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్‌ను గాయపరిచాడు.
క్రికెట్లో బ్యాటర్ మీద ఆధిపత్యం చూపించాలంటే బౌలర్ ప్రధాన అస్త్రం బౌన్సర్. స్టార్ బ్యాటర్లు సైతం బౌన్సర్లను ఎదుర్కోలేక ఇబ్బందిపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే.. ఇలాంటి బౌన్సర్లు ఎక్కువగా మనం టెస్టు క్రికెట్లో చూస్తూ ఉంటాము. బౌలర్ల సహనాన్ని బ్యాటర్లు పరీక్షించినప్పుడు.. బౌలరు బౌన్సర్ అనే ఆయుధాన్ని ఉపయోగించి వికెట్ రాబట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కొంతమంది ఎటాక్ చేస్తే మరికొందరు మాత్రం రిస్క్ తీసుకోకుండా వదిలేస్తారు. కానీ కొన్ని సార్లు బౌన్సర్లకి బ్యాటర్ గాయపడడం చూస్తాం. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో పాక్ బౌలర్ అత్యుత్సాహం చూపించి.. బ్యాటర్‌ను గాయపరిచాడు.
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా.. సోమవారం జరిగిన చివరి మ్యాచ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ నిర్దేశించిన 182 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ జట్టు 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో బ్యాటింగ్ కి వచ్చిన నజీబ్ ఉల్లా జద్రాన్ ఎదుర్కొన్న తొలి బంతికే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పాకిస్థాన్ స్పీడ్ బౌలర్ ఇహ్సానుల్లా వేసిన బౌన్సర్ ని ఎదుర్కునే క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొనే జద్రాన్ దవడ కింది భాగానికి బలంగా తగిలింది. అయితే బంతి గట్టిగా తగలడంతో రక్తం కూడా వచ్చింది. దీంతో అక్కడికక్కడే నొప్పితో విలవిల్లాడాడు నజీబ్ ఉల్లా జద్రాన్. ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికీ.. నొప్పి తగ్గకపోవడంతో రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు.
పాకిస్థాన్ నయా బౌలర్ ఇహ్సానుల్లా ఎంత స్పీడ్ వేస్తాడో పాకిస్థాన్ లీగ్ లో చూసే ఉంటారు. గంటకు 150 కిలోమీటర్లకి పైగా బౌలింగ్ వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ.. ఈ మ్యాచ్‌లో బ్యాటర్ ఎదుర్కొంటున్న తొలి బంతికే బాల్ వేయడం అవసరమా అంటూ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయారనే బాధతోనే ఇలా ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లను కావాలనే గాయపరిచాడంటూ.. పాక్ బౌలర్‌పై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదని.. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ నుంచి వీళ్లకు అలవాటైన సాంప్రదాయం అంటూ పేర్కొంటున్నారు. బ్యాటర్‌ను అవుట్ చేయలేకపోయిన సమయంలో.. ఇలా బౌన్సర్లతో వారిని గాయపర్చాలని చూస్తారని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
What a gesture from Ihsan Ullah. Checking on Najibullah Zadran, Proud of You Champion ❤️#Ihsanullah pic.twitter.com/jUczjybqxk
— Fruitchart🥣 (@Pakistanii_kuri) March 28, 2023