‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’లో పాకిస్తాన్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతోంది. దాదాపు సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. భారత్, న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్ లను ఓడించి విజయానందాన్ని ఆశ్వాదిస్తున్నారు. ఎప్పుడూ లేనిది ఈసారి వాళ్ల ఫీల్డింగ్ కూడా మెరుగైంది. ఆఫ్గన్ మ్యాచ్‌లో దాదాపు పాక్ ఓటమి భయాన్ని చవిచూశారు. కానీ, పాక్ ఆల్ రౌండర్ అసిఫ్ అలీ మెరుపు బ్యాటింగ్‌తో వారు అద్భుత విజయాన్ని మోదు చేశారు. ఒక ఓవర్‌లో 4 సిక్సులు బాది ఔరా అనిపించాడు. సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాడు. కానీ, తన గతంలో మాత్రం ఎన్నో బాధలు అనుభవించాడు. జీవితంలోనే గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు.
12 బంతుల్లో 24 పరుగులు కావాలి. ఆరు బంతుల్లోనే ఆట ముగించేశాడు అసిఫ్ అలీ. 18వ ఓవర్ ఆఖరి బంతికి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నాడు అసిఫ్ అలీ. షదబ్ ఖాన్ బాల్ టచ్ చేసి సింగిల్‌కి కాల్ చేశాడు. అందుకు అసిఫ్ అలీ రిజక్ట్ చేశాడు. నేనే స్ట్రైకింగ్ తీసుకుంటా అన్నాడు. అతని ఆత్మవిశ్వాసం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బ్యాటింగ్ చూసి పొగడ్తలతో ముంచేశారు. కానీ, ఇప్పటి అసిఫ్ అలీ ఇలా కావడానికే చాలానే కష్టపడ్డాడు. 2019లో అతని జీవితంలో మర్చిపోలేని ఘటన జరిగింది. తన కుమార్తె అతి చిన్న వయసులో ఆస్పత్రిపాలై చనిపోయంది. అది అతనిని తీవ్రంగా కలచివేసింది. తన ఫామ్ కోల్పోయాడు. జీవితంలో అత్యంత గడ్డు పరిస్థుతులను చవి చూశాడు. ఎందరి నుంచో విమర్శలు ఎదుర్కొన్నాడు. వాటన్నింటిని అధిగమించి ఇప్పుడు పాకిస్తాన్‌కు స్టార్ ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అన్న మాటను మీరు నమ్ముతారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Asif Ali you beauty #PakvsAfg pic.twitter.com/ohq4bzGIMu
— Murtaza Ali Shah (@MurtazaViews) October 29, 2021