పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించడానికి దాదాపు రెండు రోజులు సమయం ఉండడంతో అంతా ఓటమి ఖాయమనుకున్నారు. అయితే.. కెప్టెన్ బాబర్ అజమ్ అసాధారణ పోరాటానికి తోడు.. మహ్మద్ రిజ్వాన్ మెరుపు సెంచరీ.. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 96 పరుగులతో రాణించడంతో మ్యాచ్‌ను డ్రా గా ముగిసింది.. ఈ టెస్టు ఫలితంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్న వేళ.. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ చేసిన ఒక పని సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ సుత్తితో గ్రౌండ్‌లోకి ఎంటరైన విషయం మరవక ముందే.. వార్నర్ కూడా సుత్తి పట్టుకొచ్చాడు. ఐదో రోజు ఆటలో పాకిస్తాన్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 380 పరుగుల వద్ద ఉన్నప్పుడు సుత్తి పుట్టుకొచ్చిన వార్నర్ పిచ్‌పై ఉన్న ఫుట్‌మార్క్స్‌ను తొలగించి మట్టిని సరిచేశాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. ఇది చూసిన పాక్ అభిమానులు..” ఏంటి వార్నర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నావా” అంటూ ఫన్నీ కామెంట్ చేశారు. అయితే వార్నర్ వీడియోపై అతని భార్య కాండీస్ స్పందించింది. ” డేవిడ్ వార్నర్ ఇంటివద్ద ఈ పని ఇంకాస్త ఎక్కువ చేస్తే బాగుంటుంది”’ అంటూ ఫన్నీగా ట్వీట్ చేసింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 556/9 వద్ద డిక్లేర్ చేసింది. ఉస్మాన్ ఖవాజా (160), స్టీవ్ స్మిత్ (72) రాణించారు. బదులుగా పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 148 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 97/2కు డిక్లేర్ చేసింది. 506 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ధీటుగానే బదులిచ్చింది. బాబర్ ఆజామ్ (196), మహ్మద్ రిజ్వాన్ (104) సెంచరీలకు తోడుగా అబ్దుల్లా షఫీక్ (96) రాణించడంతో ఐదో రోజు ఆటముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసింది. ఆలౌట్ కాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
The Thor hammer made another cameo today. #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/6LpKTUo554
— Pakistan Cricket (@TheRealPCB) March 16, 2022
I wish @davidwarner31 would do this a little bit more around the house!! 🤣🤣 https://t.co/hFhdFGqPTA
— Candice Warner (@CandiceWarner31) March 17, 2022
So @patcummins30 is Thor ? 😲#BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/kAn8oqtVWn
— Pakistan Cricket (@TheRealPCB) March 15, 2022
Determined. Focused. Simply Sensational. These are some words we will use to describe today. 👏🏼 #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/IBZ9r3jbv2
— Pakistan Cricket (@TheRealPCB) March 16, 2022