ప్రస్తుతం ఎటు చూసినా పెళ్లిళ్ల హడావుడి కనిపిస్తోంది. యువతీయువకులు బ్యాచిలర్ లైఫ్ కు ఫుల్‌స్టాప్ పెట్టి మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ క్రమంలో పనిలో పనిగా క్రికెటర్లు కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. భారత క్రికెటర్ కెఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టిని పెళ్లాడగా, పాక్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్.. ఆ జట్టు హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్ కూతురిని మనువాడాడు. సోమవారం రాత్రి కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని షాదాబ్ ఖానే స్వయంగా వెల్లడించాడు.
పాకిస్థాన్ దిగ్గజ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ కు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు. వీరిలో పెద్ద కుమార్తెను షాదాబ్ వివాహమాడాడు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా స్పందించిన షాదాబ్ ఖాన్.. “ఈరోజు నా నిఖా. ఇది నా జీవితంలో మధురానుభూతిని పొందుతున్న క్షణం. నేను క్రికెటర్ గా ఉన్నప్పట్నుంచి నా కుటుంబం ప్రైవసీని కోరుకుంటుంది. నా భార్య అదే కోరింది. అందుకే మా పెళ్లి ఫోటోలను బాహిరంగ పరచట్లేను. మా ప్రైవసీని గౌరవించగలరని మనవి..” అంటూ షాదాబ్ తన పెళ్లి విషయం గురుంచి అందరకి తెలియజేశాడు.
Alhamdulilah today was my Nikkah. It is a big day in my life and start of a new chapter. Please respect my choices and those my my wife’s and our families. Prayers and love for all pic.twitter.com/in7M7jIrRE
— Shadab Khan (@76Shadabkhan) January 23, 2023
ఓ ఇంటివాడైన షాదాబ్ ఖాన్ కు సహచర క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్తున్నారు. ‘హెడ్ కోచ్ కూతురిని పెళ్లాడడంటే పెద్ద స్కెచ్..’ అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. జట్టులో చోటు కోసం కోచ్ కూతురిని పెళ్లాడాడు అన్నది వారి అభిప్రాయం. కాగా, పాక్ తరఫున ఇప్పటివరకు 6 టెస్టులు, 53 వన్డేలు, 84 టీ20లు ఆడిన షాదాబ్.. టెస్టులలో14, వన్డేలలో 70, టీ20ల్లో 98 వికెట్లు పడగొట్టాడు. షాదాబ్ బౌలర్ మాత్రమే కాదు.. బ్యాటింగ్ లోనూ మెరుపులు మెరిపించగల సమర్ధుడు. టెస్టుల్లో 300, వన్డేలలో 596, టీ20లలో 476 పరుగులు చేశాడు. ఇక షాదాబ్ మామ, పాకిస్తాన్ హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్.. 49 టెస్టుల్లో 208 వికెట్లు తీయగా, 169 వన్డేల్లో 288 వికెట్లు తీశాడు. షాదాబ్.. కోచ్ కూతురిని పెళ్ళాడంటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shaddy wife❤️#ShadabKhan pic.twitter.com/G56Tywdi8F
— طاہر زاہد (@TahirMKhan8) January 23, 2023
Nikah Mubarak ho mere shararti Shady bhayya. Allah pak ap dono ko hamesha khushyon or aafiyat me rakhe, Ameen. @76Shadabkhan pic.twitter.com/ibL0GKRaKR
— Muhammad Rizwan (@iMRizwanPak) January 24, 2023