ప్రస్తుతం ఇంగ్లాండ్ – పాక్ ల మధ్య మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగానే తొలి రెండు మ్యాచ్ గెలుపొందింది ఇంగ్లాండ్. దాంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను ఇంకో మ్యాచ్ ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన పాక్ బ్యాటర్లు.. రెండో టెస్ట్ లో మాత్రం చేతులెత్తేశారు. ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో 26 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. అయితే ప్రస్తుతం ఈ మ్యాచ్ కు సంబంధించిన ఓ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ గా మారింది. మ్యాచ్ ఓడిపోయిన అనంతరం బెన్ స్టోక్స్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పాక్ క్రికెటర్ నిరాకరించాడు.
ముల్తాన్ వేదికగా పాక్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. 198/4 పరుగుల వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన పాక్ కు ఇమాముల్ హక్-సౌద్ షకీల్ లు 5వ వికెట్ కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దాంతో చాలా ఈజీగా పాక్ గెలుస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ బౌలర్లు అద్బుతం చేసి పాక్ ను కుప్పకూల్చారు. దాంతో 22 ఏళ్ల అనంతరం పాక్ గడ్డపై సిరీస్ ను కైవసం చేసుకుంది బ్రిటీష్ జట్టు. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అదేంటంటే? రాబిన్ సన్ బౌలింగ్ లో పాక్ బ్యాటర్ మహ్మద్ అలీ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని బాల్ నేరుగా కీపర్ ఓలీ పోప్ చేతిలోకి వెళ్లింది. ఇంగ్లాండ్ ప్లేయర్స్ అప్పీల్ చేయడంతో.. అంపైర్ కూడా అవుట్ ఇచ్చాడు. కానీ పాక్ క్రికెటర్ అలీ రివ్యూ కోరాడు.
ఈ సమయంలోనే ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ గెలుపు సంబరాల్లో భాగంగా అలీకి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. కానీ అలీ.. రివ్యూ కోరాను వచ్చాక షేక్ హ్యాండ్ ఇస్తానని స్టోక్స్ కు చెప్పాడు. దాంతో వెంటనే స్టోక్స్ తన చేతిని వెనక్కి తీసుకుని ఓకే చెప్పి వెళ్లి.. తన టీమ్ మెంట్స్ కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ సైతం అలీని అవుట్ గా ప్రకటించాడు. ఆ తర్వాత అలీ పెవీలియన్ కు వెళ్తూ.. స్టోక్స్ తో సహా మిగతా ఇంగ్లాండ్ ప్లేయర్స్ కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే అలీ పై మాత్రం నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడు అవుట్ అని తెలిసినా కూడా రివ్యూ కోరాడని, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి? అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
— Guess Karo (@KuchNahiUkhada) December 12, 2022