భారత పేసర్ ఉమేష్ యాదవ్ ఓవల్ స్టేడియంలో కెరీర్‌లో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు రెండో రోజు తొలి ఓవర్‌లోనే వికెట్‌తీసి ఈ ఫీట్ చేశాడు. ఉమేష్ మొదటి మూడు బాల్‌లు డాట్స్‌గా వేశాడు. నాలుగో బాల్ ఆఫ్ స్టంప్‌కు దగ్గరగా ఔట్ స్వింగర్ వేయగా క్రైగ్ ఓవర్‌టన్ దానిని బ్యాక్ ఫుట్‌పై కట్ చేయాలని ప్రయత్నించాడు. అవుట్ సైడ్ ఎడ్ట్ తీసుకుని ఫస్ట్ స్లింప్‌లో ఉన్న విరాట్ కోహ్లీకి చిక్కాడు. క్రైగ్ ఓవర్‌టన్ వికెట్‌తో టెస్టుల్లో 150 వికెట్లు తీసిన ఆరో భారత పేసర్‌గా ఉమేష్ నిలిచాడు.
ఓవల్‌లో మరో రికార్డు క్రియేట్ అయ్యే అవకాశం లేకపోలేదు. టెస్టు కెరీర్‌లో వందో వికెట్‌కు తీసేందుకు బుమ్మా ఉవ్విళ్లూరు తున్నాడు. నాలుగో టెస్టు తొలిరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఇంగ్లాండ్ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపి 99 వికెట్ల మార్కు మీద ఉన్నాడు బుమ్రా. ఆ ఒక్క వికెట్ పడితే టెస్టు కెరీర్‌లో అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన ఇండియన్ పేసర్‌గా బుమ్రా పేరిట రికార్డు నమోదవుతుంది.