భారత్‌కు అండర్ 19 వరల్డ్ కప్ అందించిన తర్వాత.. జాతీయ జట్టులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న కోహ్లీ.. ఆ తర్వాత ధోని వారసుడిగా టీమిండియా సారథ్య బాధ్యతలు సైతం చేపట్టాడు. ఒక వైపు తన పరుగులు ప్రవాహాన్ని కొనసాగిస్తునే.. మరోవైపు కెప్టెన్‌గా జట్టును విజయవంతంగా నడిపించాడు. ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియాను తిరుగులేని శక్తిగా మార్చాడు. అయితే.. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ, ఐపీఎల్‌లో కెప్టెన్సీతో భారంతో కాసింత అలసటకు గురైన కోహ్లీ.. తన బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెట్టేందుకు ఒక ఫార్మాట్‌లో కెప్టెన్సీ బాధ్యతలను దించుకున్నాడు.
టీ20 వరల్డ్ కప్ 2021, ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత టీమిండియా టీ20 జట్టు కెప్టెన్సీని, ఆర్సీబీ కెప్టెన్సీని వదులుకున్నాడు. కానీ.. తర్వాత బీసీసీఐ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించింది. దీంతో.. కొన్ని రోజులకే టెస్టు కెప్టెన్సీ సైతం వదులుకున్నాడు కోహ్లీ. ఆ తర్వాత పరుగుల చేస్తున్నా.. అవి తన స్థాయికి సరిపోకపోవడంతో.. కోహ్లీ ఫామ్‌లో లేడనే ప్రచారం జరిగింది. కానీ.. ఆసియా కప్ 2022కు ముందు ఆరు వారాలు రెస్ట్ తీసుకుని సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు కింగ్ కోహ్లీ. అఫ్ఘానిస్థాన్‌పై అదిరిపోయే సెంచరీతో దుమ్మురేపాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2022లోనూ 6 మ్యాచ్‌ల్లో 296 పరుగులు చేసి టోర్నీకే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్నీ వదులుకున్న తర్వాత.. కొంతడీలా పడ్డ కోహ్లీ.. మరోసారి తన గ్రాఫ్‌ను పెంచుకున్నాడు.
దాని ఫలితంగానే.. టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్, కింగ్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. తన సూపర్ బ్యాటింగ్‌తో పరుగుల వరదపారించే కోహ్లీ.. పాపులారిటీలోనూ నంబర్ వన్‌గా నిలిచాడు. ఇండియాలో అక్టోబర్ నెలకు గాను.. మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్‌గా ఎంపికయ్యాడు. టాప్ 10లో విరాట్ కోహ్లీకే అగ్రస్థానం దక్కింది. భారత దేశంలో అత్యంత పాపులర్ అయిన క్రీడాకారుడిగా కోహ్లీ ఒకటో స్థానంలో నిలిస్తే.. రిటైర్ అయి ఆటకు దూరంగా ఉన్న ధోని రెండో స్థానంలో నిలవడం విశేషం. రిటైర్ అయినా ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. రోహిత్ తర్వాత వరుసగా.. క్రిస్టియానో రొనాల్డో, సచిన్ టెండూల్కర్, లియోనెల్ మెస్సీ, హార్దిక్ పాండ్యా, పీవీ సింధు, నీరజ్ చోప్రా, సునీల్ ఛెత్రి నిలిచారు. ఓర్మాక్స్ మీడియా అనే సంస్థ నిర్వహించిన సర్వేతో ఈ లిస్ట్ రూపొందించారు.
Virat Kohli is the most popular sports person in India on October 2022. (Source – Ormax Media)
— Johns. (@CricCrazyJohns) November 21, 2022