జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు.. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయి.. అన్న సామెత తెలిసిందే. ఒకప్పుడు గొప్పగా బతికిన వాళ్లు కటిక పేదరికాన్ని అనుభవించే పరిస్థితి రావొచ్చు.. అలాగే కటిక పేదరికంలో పుట్టిన వాళ్లు ఆ తర్వాత కోటీశ్వరులు కూడా కావొచ్చు. మరికొంత మంది ఎంత ఆస్తి ఉన్నా.. పదిమందికి సహాపడుతూ.. సాదా సీదా జీవితాన్ని గడుపుతూ ఉంటారు.
క్రికెట్ క్రీడా రంగంలో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించి.. ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో అంపైర్‌గా ఉన్న పాకిస్తాన్ క్రీడాకారుడు అసద్ రవూఫ్.. ఇప్పుడు సాదాసీదా జీవితం గడుపుతూ.. బూట్లు, బట్టలు అమ్ముతూ చిన్న షాపు నిర్వహిస్తున్నాడు. పాకిస్థాన్ తరుపు నుంచి క్రికెటర్ గా రంగంలోకి దిగిన అసద్ రఫూఫ్ 71 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు, 40 వరకు లీస్ట్ – ఏ మ్యాచ్ లు ఆడారు. 2000 నుంచి 2013 వరకు మొత్తం 170 ఇంటర్ నేషనల్ మ్యాచ్ లకు అంపైర్ గా వ్యవహరించారు. ఇదే సమయంలో ఆయన బుకీల నుంచి ఖరీదైన గిఫ్టులు స్వీకరించాడని ఆరోపణలు ఎదుర్కాన్నారు. ఆ తర్వాత శాశ్వతంగా ఆటకు దూరమయ్యారు.
ప్రస్తుతం అసద్ లాహూర్ లోని లాండా బజార్ లో ఓ దుఖానం నిర్వహిస్తున్నారను. ఇందులో ఆయన బూట్లు, సెకండ్ హ్యాండ్ బట్టలు ఇతర సామాన్లు అమ్ముతున్నాడు. ఈ సంద్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా జీవితంలో నేను కావలసినంత డబ్బు చూశాను.. ప్రస్తుతం నా షాప్‌లో పనిచేసే వర్కర్ల కోసమే పని చేస్తున్నాను. నా జీవితంలో జరిగిన సంఘటనలకు నాకు ఎలాంటి పశ్చాతం చెందడం లేదు. నాకు దురాశ లేదు, ఉన్నంతలోనే సర్ధుకొని జీవితాన్ని గడుపుతున్నాను. నేను చేస్తున్న ఈ పని నాకు సంతృప్తినిస్తుంది. నాకు ఇద్దరు కొడుకులు.. ఒకరికి అంగవైకల్యం ఉంది.. మరో బాబు అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఏ రంగంలో ఉన్నా మంచి స్థాయి.. పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాను’ అన్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.