టోక్యో ఒలంపిక్స్ లను ఈ సారి జపాన్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న దేశాల ఆటగాళ్లు పసిడి వేటలో పడ్డారు. భారత్ నుంచి ఇప్పటికే వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మిరా బాయి చానుకి సిల్వర్ పతాకాన్ని అందించగా రెజ్లింగ్ విభాగంలో ప్రియ మలిక్ పసిడి పతకం అందుకుని దేశ కీర్తి ప్రతిష్టను రెపరెపలాడించారు. ఇక ఈ సారి ఒలంపిక్స్ గేమ్స్ లో పసిడి పతకాన్ని గెలిచి రికార్డు క్రియేట్ చేసింది 13 ఏళ్ల జపాన్ అమ్మాయి నిషియా మోమిజి.
ఉమెన్స్ స్కేట్ బోర్డింగ్ పోటీల్లో భాగంగా ఈ ఘనతను సాధించి రికార్డుగా నిలిచింది ఈ జపాన్ అమ్మాయి. ఇక ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సురాలిగా ఘనతను సాధించింది పెట్టింది. ఇక ఇందులో భాగంగా స్కేట్ బోర్డింగ్ ఆటను ఈ ఒలంపిక్స్ లోనే పరిచయం చేయటం విశేషం. ఇంతకుముందు ఈ విభాగంలో బ్రెజిల్ కు చెందిన 13 ఏళ్ల లియాల్ రేసాకు రజతం దక్కగా జపాన్ కు చెందిన నకయామా ఫనా కాంస్యం దక్కించుకుంది. ఇక వీరిద్దరిని దాటి నిషియా మోమిజిని గోల్డ్ మెడల్ దక్కించుకోవటం విశేషంగా చెప్పవచ్చు.