క్రికెట్లో ఒక ఓవర్లో ఒక హ్యాట్రిక్ తీస్తేనే పెద్ద ఘనతగా చూస్తారు. అలాంటిది ఒక బౌలర్ మాత్రం ఒకే ఓవర్లో ఏకంగా డబుల్ హ్యాట్రిక్ సాధించాడు.
క్రికెట్‌ను బ్యాట్స్‌మెన్ గేమ్‌గా చెబుతుంటారు. అయితే టెస్టు క్రికెట్లో మాత్రం బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లకు కూడా సమానావకాశాలు ఉంటాయి. లాంగ్ ఫార్మాట్లో గెలుపు కోసం ఆయా జట్లు తమ దేశ పరిస్థితులకు తగ్గట్లుగా స్పిన్, పేస్ పిచ్‌లు తయారు చేసుకోవడం కూడా చూస్తుంటాం. టెస్టుల విషయాన్ని పక్కనబెడితే.. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ మాత్రం పూర్తిగా బ్యాట్స్‌మెన్ ఫేవర్‌గా మారిపోయింది. ఆడియెన్స్‌కు ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం ఫ్లాట్ పిచ్‌లు తయారు చేస్తున్నారు. దీంతో బ్యాట్స్మెన్లు బౌలర్లను ఆడుకుంటున్నారు. ఇలాంటి టైమ్‌లో ఒక వికెట్ తీయడమే బౌలర్లకు కష్టమైపోతుంది. అలాంటిది ఇంకా హ్యాట్రిక్‌లు తీయాలనే ఆలోచనే రాదు. వరల్డ్ క్రికెట్లో ఇప్పటివరకు చాలా మంది బౌలర్లు హ్యాట్రిక్ వికెట్లు తీశారు.
టెస్టులు, వన్డేలు, టీ20ల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఇండియన్ క్రికెటర్స్ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఒక 12 ఏళ్ల పిల్లాడు డబుల్ హ్యాట్రిక్ తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ అండర్-12 ప్లేయర్ అయిన ఆలివర్ వైట్‌హౌస్ అనే పిల్లాడు ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్ తరఫున బరిలోకి దిగిన వైట్‌హౌస్.. కుఖిల్ టీమ్‌పై ఆరు బాల్స్‌లో ఆరు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఒక్క రన్ కూడా ఇవ్వకుండా మొత్తంగా 8 వికెట్లు తీయడం విశేషం. కాగా, వైట్‌హౌస్ రక్తంలోనే స్పోర్ట్స్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. అతడు మరెవరో కాదు.. 1969 వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్ ఆన్ జోన్స్ మనవడే కావడం గమనార్హం.
What an achievement for our u12 player. His final match figures were 2–2-8-0 ! Only 2 wickets in his second over 🐗🏏 pic.twitter.com/0L0N36HIcI
— Bromsgrove Cricket Club (@BoarsCricket) June 11, 2023
In an under 12 game on Friday, Ollie Whitehouse completed cricket by taking 6 wickets in an over… all bowled
😳😳😳😳😳😳https://t.co/dbpKjo8ltr@bbctms @ThatsSoVillage @CowCornerPod pic.twitter.com/Zn4DXTWCHl
— Bromsgrove Cricket Club (@BoarsCricket) June 11, 2023