IPL.. ప్రపంచ క్రికెట్ చరిత్ర గతిని మార్చిన టోర్నమెంట్. ఐపీఎల్ పుణ్యామా అని అన్ని దేశాలు కూడా తమ తమ సొంత దేశాల్లో ఇలాంటి టోర్నీలను నిర్వహిస్తున్నారు. దాంతో ఎంతో మంది నైపుణ్యమైన ఆటగాళ్లు కూడా వెలుగులోకి వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఐపీఎల్ తరహాలోనే వెస్టిండిస్ సైతం కరీబియన్ లీగ్ ను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ లీగ్ 10వ సీజన్ నడుస్తోంది. ఇక తాజాగా జరుగుతున్న ఈ సీజన్ లో రికార్డులు కొల్లగొడుతున్నారు పలువురు ఆటగాళ్లు. తాజాగా గయానా అమెజాన్ వారియర్స్-జమైకా తల్లావాస్ ల మధ్యన జరిగిన మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిసింది. ఈ మ్యాచ్ లో గయానా వారియర్స్ 12పరుగులతో విజయం సాధించింది. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..
గయానా అమెజాన్ వారియర్స్-జమైకా తల్లావాస్ జట్ల మధ్య 25 వ మ్యాచ్ జరిగింది. మెుదటగా టాస్ గెలిచిన జమైకా బౌలింగ్ ను ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగానే ఆ జట్టు శుభారంభాన్ని అందుకుంది. 2వ ఓవర్లోనే స్టార్ ఓపెనర్ గుర్బాజ్(0) ను గ్రీన్ అవుట్ చేశాడు. మరో ఓపెనర్ హెమ్రాజ్(13) ను కూడా తక్కువ పరుగులకే గ్రీన్ పెవిలియన్ కు పంపించాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నాగానీ షై హోప్ 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో 60 పరుగులు చేసి రాణించాడు. కెప్టెన్ హెట్మయర్(11) కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. గయానా వారియర్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పొతూనే ఉంది. జట్టు ఓ దశలో 15. 3 ఓవర్లకు 98/7 స్కోర్ తో నిలిచింది. కానీ నిర్ణీత 20 ఓవర్లలో జట్టు స్కోరు 178/8 చేసిందంటే అది ఓడియన్ స్మిత్ దయే.
ఓడియన్ స్మిత్.. కేవలం 16 బంతుల్లో 6 సిక్స్ లతో 42 పరుగులు చేశాడు. అతనికి తోడు కీమోపాల్ కూడా 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 24 రన్స్ చేసి జట్టుకు భారీ స్కోరును అందించారు. ఈ క్రమంలోనే ఓడియన్ స్మిత్-కీమోపాల్ జోడీ చివరి 4 ఓవర్లలో 80 పరుగులు పిండుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లపై ఫోర్లు సిక్స్ లతో విరుచుకు పడ్డారు. ఇక జమైకా పేసర్ ప్రిటోరియస్ కు స్మిత్ చుక్కలు చూపించాడనే చెప్పాలి. 18వ ఓవర్ వేయడానికి వచ్చిన ప్రిటోరియస్ కు తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు స్మిత్. ఈ ఓవర్లో స్మిత్ ఏకంగా 5 సిక్సర్లు బాదడం విశేషం. తర్వాతి ఓవర్లో కూడా పాల్ అమీర్ బౌలింగ్ లో 2 ఫోర్లు, 2 సిక్స్ లు బాదాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో గయానా వారియర్స్ 8 వికెట్లకు 178 పరుగులు చేసింది. జమైకా బౌలర్లలో నబీ 3 వికెట్లు తీయగా, గ్రీన్ 2 వికెట్లు పడగొట్టాడు.
ఇక 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమైకా తల్లావాస్ కు ఓపెనర్ బ్రండన్ కింగ్ 66 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. కాని జట్టును మాత్రం గెలిపించలేక పోయాడు. జట్టులోని ఇతర ఆటగాళ్ల నుంచి ఎలాంటి సహకారం అందలేదు అతడికి. మిగతా ఆటగాళ్లలో లూయిస్(13), మెకంజీ(15), పావెల్(4), రైఫర్(6), అలెన్(1), నబీ(5), వసీమ్(5) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు దీంతో నిర్ణీత 19.5 ఓవర్లలో 166 పరుగులకు జమైకా ఆలౌట్ అయ్యింది. దీంతో 12 పరుగుల తేడాతో జమైకా తల్లావాస్ ఓడిపోయారు. 18 వ ఓవర్లో సిక్సర్ల వర్షం కురిపించిన ఓడియన్ స్మిత్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ప్రస్తుతం స్మిత్ కొట్టిన సిక్సర్ల వీడియో నెట్టింట వైరల్ గా మారింది. స్మిత్ విధ్వంసం చాటున బ్రెండన్ కింగ్ సాధించిన సెంచరీ కనుమరుగైంది. మరి ఈ మ్యాచ్ పై, అలాగే స్మిత్ సిక్సర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
5 SIXES IN THE OVER! Watch the 5th six make its way into the stands as this evening’s @fun88eng Magic Moment!#CPL22 #CricketPlayedLouder #BiggestPartyInSport #GAWvJT #Fun88 pic.twitter.com/t2u7mcoyd1
— CPL T20 (@CPL) September 22, 2022
The Warriors win their first home game ! #CPL22 #BiggestPartyInSport #CricketPlayedLouder #GAWvJT pic.twitter.com/F6lU1KBQzl
— CPL T20 (@CPL) September 22, 2022
That was some ball striking by Odean Smith and Keemo Paul tonight for the @GYAmazonWarrior . A little glimpse into what so many of us here in the Caribbean hope to see more of in international cricket. @CPL
— Ian Raphael Bishop (@irbishi) September 22, 2022