క్రికెట్‌లో రెండు దేశాలు తలపడితే ఎంత ఉత్కంఠగా చూస్తారో.. అలాగే ఐపీఎల్, బిగ్ బ్యాష్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ వంటి వాటికి కూడా ప్రేక్షకాదరణ చాలా ఎక్కువ. ఈ సీజన్లు జరుగుతున్న రోజుల్లో నెట్టింట ఎక్కడ చూసినా వాటి గురించే అప్‌డేట్లు, వీడియోలు, మీమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కరేబీయన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అది వైరల్ కావడమే కాదు.. సదరు ప్లేయర్ పరువు కాస్తా పోతోంది. క్రికెట్ ప్రపంచం ముందు నవ్వుల పాలయ్యేలా చేసింది. ఇంతకీ అతను ఏం చేశాడు అని అనుకుంటున్నారా? పరుగులు ఎక్కువ ఇస్తున్నాడనే అసహనంతో అతను చేసిన పనికి మరిన్ని పరుగులు రావడమే అందుకు కారణం.
ఆ పని చేసిన మహానుభావుడు మరెవరో కాదు.. వెస్టిండిస్ స్టార్ ఆల్రౌండర్ ఓడియన్ స్మిత్. అసహనంతో అతను చేసిన ఇప్పుడు నవ్వులపాలయ్యేలా చేస్తోంది. ఓడియన్ స్మిత్ సీపీఎల్‌లో గయానా అమెజాన్ వారియర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వాళ్లు బార్బడోస్ రాయల్స్ జట్టుతో ఆడిన మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది. ఓడియన్ స్మిత్‌కు ఆ మ్యాచ్‌లో అసలు వికెట్ పడలేదు. అప్పటికే అతని బౌలింగ్‌లో చాలా పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ 16వ ఓవర్ లో స్మిత్ ఒక సిక్సర్- బౌండరీతో పరుగులు ఇచ్చాడు. అలా పరుగులు రావడంతో ఆత్మవిశ్వాసం కోల్పోయి.. వరుసగా 3 వైడ్లు కూడా వేశాడు. దాంతో అతని అసహనం మరింత ఎక్కువైంది. ఎలా బౌలింగ్ వేయాలి? ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్నే మర్చిపోయినట్లు కనిపించాడు.
3 వైడ్లు తర్వాత గుడ్ లైన్ అండ్ లెంగ్త్ తో ఓడియన్ స్మిత్ వేసిన బంతిని బ్యాటర్ డిఫెండ్ చేశాడు. ఆ బంతి ఓడియన్ స్మిత్ వైపుకు చిన్నగా దొర్లుతూ వెళ్లింది. అప్పటికే అసహనంతో ఉన్న స్మిత్ ఆ బంతిని తన్నాడు. అది కాస్తా దూరంగా వెళ్లింది. ఇంకేముంది అదే అదునుగా బ్యాటర్లు రెండు పరుగులు చేశారు. నిజానికి డాబ్ బాల్ కావాల్సిన బంతికి రెండు పరుగులు సమర్పించాడు. ఆ విషయంపై ఆ జట్టు కెప్టెన్ హెట్‌మెయర్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో బార్బడోస్ రాయల్స్ విజయం సాధించడంతో ఓడియన్ స్మిత్ బతికిపోయాడు. కానీ, ఈ వైరల్ వీడియో చూసిన క్రికెట్ ప్రేక్షకులు మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పరుగులు ఇస్తే ఇచ్చావ్.. కొన్నిసార్లు బౌలర్లకు ఆ పరిస్థితి వస్తుంది. కానీ, నీకు అంత బలుపు ఎందుకు భయ్యా? అలా చేశావ్ ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి పరుగులు ఇవ్వడం సంగతి పక్కన పెడితే ఓడియన్ స్మిత్ మాత్రం పరువైతే పోగొట్టుకున్నాడు.
Odean smith what is this behaviour ?? #Cricket #CricketTwitter #CPL2022 #CPL22 #odeansmith pic.twitter.com/msWWKisbxi
— cricketlab (@cricketlab2292) September 26, 2022