క్రీడా ప్రపంచంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ అంతా.. ఇంతా కాదు.. తమ అభిమాన జట్టు మ్యాచ్ ఉందంటే చాలు పని పక్కన పెట్టి మరీ మ్యాచ్ చూడ్డానికి వెళ్తారు. ఇటీవల తన ప్రియురాలిని కాదని మరీ మ్యాచ్ చూడ్డానికి వచ్చిన ప్రియుణ్ణి చూశాం. అంత అభిమానం క్రికెట్ అంటే.. ప్రస్తుతం న్యూజిలాండ్– ఐర్లాండ్ మధ్య వన్డే సీరిస్ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మ్యాచ్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.. ఎందుకంటారా? పదండి మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం..
క్రికెట్ లో ఎప్పుడు ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు బ్యాట్స్ మన్ ఆడిన షాట్లకు ఏ ఫీల్డరో క్యాచ్ పడితే.. ఆ బాల్ కాస్తా నోబాల్ అయితే.. ఆ ఆటగాడిని అదృష్టవంతుడు అంటాం. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు మనం క్రికెట్ లో చూస్తూనే ఉంటాం. కానీ తాజాగా న్యూజిలాండ్, ఐర్లాండ్ మధ్య జరిగింది.. మీరు ఇది వరకు ఎప్పుడూ చూడని ఒక విచిత్రం జరిగింది. ఆ వివరాలు ఏంటో తెలిస్తే మీరు ఔరా అనటం ఖాయం. అందుకు కారణం అంపైర్ అలీందార్..
Heart-break for our lads, but hats off to the @BLACKCAPS for the ODI series win.
Martin Guptill was awarded Player of the Match and Multibagger of the Match, while Michael Bracewell was Player of the Series.
On we go to the T20I series!#BackingGreen | #Exchange22 ☘️🏏 pic.twitter.com/TrrKugj3R0
— Cricket Ireland (@cricketireland) July 15, 2022
అంపైర్ గా అలీందార్ క్రికెట్ అభిమానులకు సుపరిచితుడే. ఎన్నో మ్యాచ్ లకు అంపైరింగ్ చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ తాజాగా న్యూజిలాండ్, ఐర్లాండ్ మ్యాచ్ లో తన నిర్ణయంతో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ బ్యాట్స్ మెన్ సిమి సింగ్ 11 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా.. న్యూజిలాండ్ పేసర్ బ్లెయిర్ టిక్నర్ బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో సిమి ఆడిన ఓ బంతిని కీపర్ క్యాచ్ అందుకున్నాడు. అక్కడున్న అంపైర్ సైతం దాన్ని ఔట్ గా ప్రకటించాడు. కానీ ఇక్కడే మరో అంపైర్ అలీందార్ నాటౌట్ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దానికి కారణం బౌలర్ బంతి విసిరే ముందు తన ప్యాంట్ కు ఉన్న కర్చీఫ్ కిందపడిపోవడమే. అది బ్యాట్స్ మెన్ దృష్టిని మరల్చే అవకాశం ఉండటంతో అంపైర్ నాటౌటిచ్చాడు.
క్రికెట్ నిబంధన 20.4.2.7 ప్రకారం ఎవరైనా బౌలర్ బౌలింగ్ చేసేటప్పుడు బ్యాట్స్ మెన్ దృష్టి మరల్చే వీలున్నప్పుడు అంపైర్ ఆ బంతిని డెడ్ బాల్ గా ప్రకటించాల్సి ఉంటుంది. ఆ నిబంధనల ప్రకారమే అలీందార్.. సిమిని నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్, బౌలర్ టిక్నర్ అంపైర్ తో వాగ్వాదానికి దిగారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
A ton for Harry Tector!
His second in the series – a sublime effort.
SCORE: https://t.co/iHiY0Un8Zh#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/Du6OTRqEBC
— Cricket Ireland (@cricketireland) July 15, 2022
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 360 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 359 పరుగులు చేసి కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. గత మ్యాచ్ లో సైతం ఐర్లాండ్ జట్టు ఇలాగే పోరాడి ఓడిపోయిన సంగతి విదితమే. దీంతో మూడు వన్డేల సీరిస్ ను న్యూజిలాండ్ 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. మరి ఈ వెరైటీ నాటౌట్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— ParthJindalClub (@ClubJindal) July 13, 2022