ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు వన్డే కెప్టెన్సీ కూడా అప్పగిస్తూ.. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. ఇటివల ఆరోన్ ఫించ్ ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో.. ఆ స్థానంలో కమిన్స్‌ను కెప్టెన్ చేస్తున్నట్లు ఆసీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాగా.. ఫించ్ స్థానంలో డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా వన్డే టీమ్‌కు కెప్టెన్ అవుతాడని అంతా భావించారు. అందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా సుముఖంగా ఉన్నట్లు అప్పట్లో వార్తలు సైతం వచ్చాయి. అప్పటికే డేవిడ్ వార్నర్‌పై కెప్టెన్ కాకుండా జీవిత కాలం నిషేధం ఉన్నా.. దాన్ని తొలగించి వన్డే జట్టుకు కెప్టెన్ చేస్తారనే గుసగుసలు వినిపించాయి. కానీ.. చివరికి టెస్టు టీమ్ కెప్టెన్ ఆల్‌రౌండర్ కమిన్స్‌కే వన్డే కెప్టెన్సీ బాధ్యతలను సైతం అప్పగించారు.
వార్నర్‌ను ఇంకా వెంటాడుతున్న ఆ తప్పిదం..
కాగా.. వార్నర్‌కు కెప్టెన్సీ దక్కకపోవడానికి వెనుక ఉన్న నిషేధం ఏమిటంటే.. 2018లో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా డేవిడ్ వార్నర్ శాండ్ పేపర్‌తో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదంలో వార్నర్‌తో పాటు స్టీవ్ స్మిత్ కూడా ఉన్నాడు. వీరిద్దరూ తమ తప్పుఒప్పుకోవడంతో.. వార్నర్‌పై ఆస్ట్రేలియా టీమ్‌కు జీవిత కాలంలో కెప్టెన్ కాకుండా నిషేధం విధించారు. ఇప్పటికీ ఆ నిషేధం కొనసాగుతోంది. కానీ.. అనూహ్యంగా ఆరోన్ ఫించ్ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పడంతో అతని స్థానంలో వార్నర్ ది బెస్ట్ ఆప్షన్‌గా కనిపించాడు. కానీ.. అతనిపై నిషేధం ఉంది. ఈ విషాయన్ని సైతం పక్కన పెట్టి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పెద్దలు వార్నర్‌ను కెప్టెన్సీ కోసం పరిగణంలోకి తీసుకున్నారు.
కానీ.. వార్నర్‌పై ఉన్న నిషేధాన్ని తొలగించేందుకు నిబంధనల్లో సవరణలు చేయాల్సి వచ్చింది. కానీ.. దానికోసం కోడ్ సవరణ పరిశీలించారు. అది వీలుకాకపోవడంతో చేసేందేం లేక.. ప్యాట్ కమిన్స్‌కే పగ్గాలు అప్పగించారు. కాగా.. వార్నర్‌కు కెప్టెన్సీ దక్కకపోవడంపై అతని అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు చాలా కాలంపాటు ఆడటంతో వార్నర్‌కు తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అతనికి కెప్టెన్సీ దక్కకపోవడంపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. వార్నర్‌కు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇక కమిన్స్‌కు వన్డే కెప్టెన్సీ దక్కడంతో రెండు ఫార్మాట్లలో ఆసీస్ కెప్టెన్‌గా ఉన్నాడు. మరీ టీ20ల్లో ఫించ్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తారా? లేక ఆ బాధ్యతలు కూడా కమిన్స్‌కే అప్పగిస్తారా? అనే ఈ టీ20 వరల్డ్ కప్ తర్వాత తేలనుంది.
Selection chief George Bailey says some now backing David Warner for a leadership position were saying something entirely different two years ago… pic.twitter.com/hSjOz4bwMD
— cricket.com.au (@cricketcomau) October 18, 2022
Pat Cummins has been named Australia’s 27th ODI captain 🙌 pic.twitter.com/T0p02wwjiP
— Cricket Australia (@CricketAus) October 17, 2022