ప్రస్తుతం అతడు అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ ఎన్నో మ్యాచులు గెలిపించ్చాడు. కానీ ఏం లాభం జాతీయ జట్టులో స్థానం కరువవుతుంది. తాజాగా వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేసిన ప్రాబబుల్స్ లిస్టులో రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ కి జాతీయ జట్టులో స్థానం దక్కలేదు.
ఎప్పుడు ఎవరి టైం ఎలా నడుస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఫామ్ లో ఉన్నప్పటికీ కొన్నిసార్లు అనూహ్యంగా చోటు కోల్పోవడం.. అనుకోకుండా జాతీయ జట్టు నుండి పిలుపు రావడం వంటి విషయాలు కొన్ని సార్లు షాక్ కి గురి చేస్తాయి. ప్రస్తుతం అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. తాజాగా వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేసిన వెస్టిండీస్ ప్రాబబుల్స్ లిస్టులో రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ కి జాతీయ జట్టులో స్థానం దక్కలేదు. ఎవ్వరు ఊహించని విధంగా జట్టులో స్థానం కోల్పోయాడు. మరి బాగా ఆడుతున్న సెలెక్టర్లు అతన్ని ఎందుకు పక్కన పెట్టారు?ఇంతకీ ఆ స్టార్ ప్లేయర్ ఎవరు అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం అతడు అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ ఎన్నో మ్యాచులు గెలిపించ్చాడు. కానీ ఏం లాభం జాతీయ జట్టులో స్థానం కరువవుతుంది. 2022 టీ 20 వరల్డ్ కప్ లో ఇప్పటికే అతనిని పక్కన పెట్టేసి తగిన మూల్యం చెల్లించుకున్న విండీస్ తాజాగా వన్డే వరల్డ్ కప్ లో కూడా అతన్ని పట్టించుకోలేదు. అతనెవరో కాదు విండీస్ విధ్వంసకర వీరుడు షిమ్రోను హేట్మేయర్.భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ కి వెస్టిండీస్ నేరుగా అర్హత సాధించని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరల్డ్ కప్ ఆడేందుకు విండీస్ క్వాలిఫయర్ మ్యాచులు ఆడాల్సి ఉంది. జింబాబ్వే వేదికగా ఈ మ్యాచులు జరగనున్నాయి. ఈ క్రమంలో విండీస్ క్రికెట్ బోర్డు క్వాలిఫైర్ మ్యాచుల కోసం తమ జట్టుని ప్రకటించింది.
మంచి ఫామ్ లో ఉన్న హేట్మేయర్ కి జట్టులో స్థానం లభిస్తుందని అందరూ భావించారు. కానీ ఈ బ్యాటర్ కి మొండి చెయ్యి తప్పలేదు. ఇక ఈ జట్టుకి బ్రాడన్ కింగ్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండడగా.. వైస్ రోవ్ మెన్ పావెల్ ని సెలక్ట్ చేశారు. దాదాపు ఏడాది తర్వాత అల్ రౌండర్ కీమోపాల్ కి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వగా.. జింబాబ్వే టెస్ట్ సిరీస్ లో సత్తా చాటిన మోటీకి తొలిసారి స్థానం లభించింది. ఇక ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 15 నుండి ప్రారంభం అవుతుంది. మరి హేట్మేయర్ కి వన్డే వరల్డ్ కప్ లో చోటు లభించకపోవడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
🚨 BREAKING NEWS🚨
CWI announces the squad for the ICC Cricket World Cup Qualifiers in Zimbabwe.Read More⬇️https://t.co/bjgciuW1F5
— Windies Cricket (@windiescricket) May 11, 2023