బీసీసీఐ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని కావాలనే తప్పిస్తున్నట్లు.. తన మూడేళ్ల పదవీ కాలంలో పనితీరు బాగాలేనందుకే దాదాపై బోర్డులోని సభ్యులంతా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ వార్తలు వచ్చాయి. కాగా.. అవన్నీ వట్టి పుకార్లే అంటూ ప్రస్తుత బీసీసీఐ ట్రెజరర్, ఐపీఎల్ మాజీ ఛైర్మెన్ అరుణ్ దుమాల్ కొట్టిపారేశారు. గంగూలీ స్థానంలో కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యుడు రోజర్ బిన్నీ ఎన్నిక కానున్న నేపథ్యంలో అరుణ్ దుమాల్ చెప్పిన విషయాలు ప్రాధ్యాన్యతను సంతరించుకున్నాయి. గంగూలీపై వచ్చిన వార్తలన్నీ పుకార్లే అన్నారు దుమాల్.
నిజానికి గంగూలీని అనే ధైర్యం బీసీసీఐలో ఏ ఒక్కరికీ లేదని అన్నారు. దాదా పనితీరు బాగాలేని కారణంగానే అతనికి వ్యతిరేకంగా బోర్డు సభ్యులు కొత్త అధ్యక్షుడి కోసం పట్టుబట్టారని చెప్పడంలో నిజం లేదన్నారు. కరోనా కష్టకాలంలోనూ గంగూలీ ఐపీఎల్‌ను నిర్వహించి బీసీసీఐ ఖాజాన నింపారని.. అదొక్కటి చాలా దాదా పనితీరు ఏంటో చెప్పడానికి అని దుమాల్ పేర్కొన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ చేసిన దానికి బోర్డులని సభ్యులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. టీమిండియా కెప్టెన్‌గా భారత క్రికెట్‌కు ఎంతో చేసిన గంగూలీ.. ప్రపంచంలోనే గొప్ప లీడర్ అంటూ కొనియాడారు.
కాగా.. స్వాతంత్రం వచ్చిన సమయం నుంచి ఇప్పటి వరకు ఎవరూ కూడా రెండో సారి అధ్యక్షుడిగా కొనసాగలేదని దుమాల్ తెలిపారు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా రెండో సారి కాకపోవడానికి ఆయన పనితీరు బాగలేకపోవడం అనే కానేకాదని అన్నారు. అలాగే రోజర్ బిన్నీ అధ్యక్షుడిగా నామినేషన్ వేస్తున్న సమయంలోనూ గంగూలీ పక్కనే ఉన్నారని దుమాల్ వెల్లడించారు. కాగా.. గంగూలీని రెండో సారి పోటీలో లేకపోవడానికి కేంద్ర హోం మంత్రి కుమారుడు, ప్రస్తుత, కాబోయే బీసీసీఐ కార్యదర్శి జైషానే అనే ఆరోపణలు వినిపించాయి. గంగూలీ బీజేపీలో చేరనందుకే దాదాను బీసీసీఐ నుంచి తప్పించారంటూ టీఎంసీ పార్టీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
Nobody spoke a word against Sourav Ganguly, says Arun Dhumal https://t.co/FQIviFpTwI
— Vikrant Gupta (@vikrantgupta73) October 15, 2022