టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ను వెంటనే గుర్తుపట్టి ఉంటారు. అతన్ని గుర్తుపట్టడం పెద్ద విషయం కాదు. కానీ.. గంభీర్ పక్కన పాల బుగ్గలతో ముద్దుముద్దుగా బొద్దుబొద్దుగా ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా? అతన్ని గుర్తుపట్టడం అంత ఈజీ కాదులేండి. ఆ ఫొటోలో ఉన్న కుర్రాడో ఐపీఎల్‌లో ఒక సెన్సేషన్. కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టుకు ఆడతాడు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు గంభీర్‌తో ఫొటో దిగిన ఆ కుర్రాడు అదే గంభీర్‌తో పాటు ఐపీఎల్‌లో అదరగొట్టాడు. ఇప్పుటికి కూడా ఐపీఎల్‌లో కేకేఆర్‌కే ఆడుతున్నాడు. గతేడాది టీమిండియా జట్టులోకి ఎంట్రీ కూడా ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పవర్‌ఫుల్ హిట్స్ కొట్టే ఆటగాడు. ఏంటి ఇన్ని హింట్స్ ఇచ్చినా.. ఇంకా గుర్తుపెట్టలేదా? అతనేనండి.. కేకేఆర్ మిడిల్డార్ బ్యాటర్ నితీష్ రాణా.
రాణా తన చిన్నతనంలో ఏదో మ్యాచ్ సందర్భంగా తన అభిమాన క్రికెటర్ అయిన గంభీర్‌తో ఫొటో తీసుకున్నాడు. అప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటో గంభీర్ అందరి తెలిసినా.. గంభీర్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరంటూ నెటిజన్లు తెగ హైరానా పడిపోతున్నారు. గంభీర్‌పై అభిమానంతో అతనితో ఫొటో దిగిన రాణా.. మళ్లీ అతని కెప్టెన్సీలోనే ఐపీఎల్ లాంటి బిగ్ ఈవెంట్‌లో ఆడి సక్సెస్ అవుతాడని అప్పుడు ఊహించి ఉండడు. అలాగే గంభీర్ సైతం తనతో ఫొటో తీయించుకున్న కుర్రాడు తన హోమ్ టీమ్ లాంటి కేకేఆర్‌కు కీ ప్లేయర్‌గా ఎదుగుతాడని అనుకోని ఉండడు. కానీ.. వాళ్లిద్దరి భవిష్యత్తు ఆ విధంగా రాసి ఉంది.
నితీష్ రాణా ఐపీఎల్‌లోకి 2016లో ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు అతని బేస్ ప్రైజ్ రూ.10 లక్షలకు ముంబై ఇండియన్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఇక 2018లో నితీష్ రాణాను కోల్‌కత్తా నైట్ రైడర్స్ దక్కించుకుంది. వేలంలో అతని ఏకంగా రూ.3.40 కోట్ల ధర పెట్టింది. అప్పటి నుంచి 2021 వరకు అదే ధరతో కేకేఆర్‌లోనే కొనసాగాడు. ఇక ఐపీఎల్ 2022 మెగా వేలంలో మళ్లీ కేకేఆర్ రాణాను దక్కించుకుంది. ఈ సారి ఊహించని ధర పలికాడు. ఏకంగా రూ.8 కోట్లు వెచ్చించి రాణాను కేకేఆర్ తిరిగి దక్కించుకుంది. ఇక ఇప్పటి వరకు మొత్తం 91 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన రాణా.. 85 ఇన్నింగ్స్‌ల్లో 2181 పరుగులు చేశాడు. అందులో 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో రాణా అత్యధిక స్కోర్ 87. ఇక 2021లో శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లతో టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు రాణా.. టీమిండియా తరఫున ఒక వన్డే, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 7, రెండు టీ20ల్లో 15 పరుగులు సాధించాడు.
Nitish Rana about his Gautam bhaiya on #KnightClub! Credits Gautam Gambhir his childhood inspiration! Even Mahela Jayawardene realized the changes 😄 pic.twitter.com/ELdBzjhdkC
— Team Gautam Gambhir (@gautamgambhir97) March 19, 2018
Cricketer Nitish Rana who is leading the Delhi team in #SyedMushtaqAliTrophy, took to social media to extend an emotional birthday wish to his mentor former India opener #GautamGambhir with an unseen childhood picture.@NitishRana_27 @GautamGambhir pic.twitter.com/3IocQn6qwT
— Cricket Fanatic (@CricketFanatik) October 14, 2022