క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆసియా కప్ ముగిసింది.. అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో శ్రీలంక టైటిల్ ను ఆరోసారి ఎగరేసుకుపోయింది. ఇక మూడో సారి కప్ ను ముద్దాడాలన్నపాక్ కల నెరవేరలేదు. తాజాగా జరిగిన ఈ మ్యాచ్ గురించి పాకిస్థాన్ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. పాక్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. ఇక అందరు పొగుడుతున్న స్టార్ బ్యాటర్ రిజ్వాన్ పై విమర్శలు గుప్పించాడు. ఫైనల్లో అతడి ఇన్నింగ్స్ వల్ల పాక్ జట్టుకు నయా పైసా ఉపయోగం లేదని అక్తర్ ఏకిపారేశాడు. దేశం సంక్షోభంలో ఉన్నా గానీ అద్భుతమైన ఆటతో శ్రీలంక అందరి మనసులను గెలిచిందని షోయబ్ అన్నాడు. ఇదే విషయంపై పాక్ కోచ్ ముస్తాక్ మాత్రం రిజ్వాన్ ఆటను ప్రశంసించాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
టీ20 అంటేనే వచ్చిన బంతిని వచ్చినట్లు బాదడమే. ఉన్నంతలో ఎంత తక్కువ బాల్స్ లో అంత ఎక్కువ పరుగులు చేస్తే అంత మంచిది. కానీ వచ్చిన వారంతా అలా బాదే క్రమంలో అవుటవుతూ ఉంటారు. తాజాగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాక్ ఓపెనర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 49 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఇతడు చేసిన 55 రన్సే ఆ జట్టులో అత్యధికం. మరింకేంటి? అక్తర్ ఎందుకు అతడ్ని తిడుతున్నాడు? అన్న అనుమానం మీకు రావచ్చు. అసలు విషయంలోకి వస్తే రిజ్వాన్ ఎక్కువ బంతులను ఆడటం వల్ల సాధించాల్సిన రన్ రేట్ పెరిగింది. దాంతో వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి పడి.. వారు త్వరగా అవుటయ్యే ప్రమాదం ఉంది. తాజాగా ఫైనల్లో జరిగింది ఇదే అని అక్తర్ వాదన. ఆసియా కప్ లో పాక్, ఇండియా బెస్ట్ టీమ్స్ కావు.. లంకే బెస్ట్ టీం అని అక్తర్ వ్యాఖ్యానించాడు.
తాజాగా ఈ మ్యాచ్ పై తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందిస్తూ..”రిజ్వాన్ 49 బంతుల్లో 55 రన్స్ చేశాడు దాని వల్ల జట్టుకు వచ్చిన ప్రయోజనం ఏంటీ? ఏం లేదు ఈ ఇన్నింగ్స్ వల్ల నయాపైసా ఉపయోగం కూడా లేదని మండిపడ్డాడు. ఈ రోజు పాకిస్థాన్ చెత్త ప్రదర్శన చేసింది. శ్రీలంక ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసింది. నిజంగా ఇది గొప్ప ప్రదర్శన. హ్యాట్సాఫ్ టు లంక” అని ప్రశంసించాడు. “పాక్ జట్టులో చాలా లోపాలు ఉన్నాయి.. వాటిని సరిచేసుకోవాలి. ఇక జట్టులో జమాన్, ఇఫ్తికర్ ఖుష్ దిల్ స్థానాలను ఒక సారి పరిశీలించాలి. అని బోర్డుకు సూచించాడు. ఇక కెప్టెన్ బాబర్ పై విమర్శలు గుప్పించాడు. బాబర్ ఈ మ్యాచ్ లోనే కాక మెుత్తం ఆసియా కప్ లోనే విఫలం అయ్యాడు. బాబర్ ఫామ్ లోనే క్లాస్ ఉంటుంది కానీ.. క్లాస్ లో ఫామ్ ఉండదు.. అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో బౌలర్లు.. బ్యాటర్లు.. పూర్తిగా విఫలం అయ్యారు అంటూ మండిపడ్డాడు. అదీ కాక వచ్చిన బ్యాట్స్ మన్ వచ్చినట్లు భారీ షాట్లు ఆడడానికి ప్రయత్నించటం ఏంటని” ప్రశ్నించాడు.
ఈ క్రమంలోనే పాక్ కోచ్ సక్లియిన్ ముస్తాక్ రిజ్వాన్ కు అండగా నిలిచాడు. అక్తర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..”ఇంట్లో కూర్చుని ఎన్నైనా మాట్లాడతారు.. ఒక్క సారి గ్రౌండ్ లోకి దిగితే తెలిసింది. బయటి వ్యక్తులు స్కోర్లు, రికార్డులు చూసి మాట్లాడతారు.. అది చాలా తప్పు. అసలు బయటి వారికి డ్రెస్సింగ్ రూంలో ఏం జరుగుతుందో ఏం తెలుసు అంటూ మండిపడ్డాడు. క్రికెటర్లతో కలిసి మెలిసి ఉంటేనే వారి బలం బలహీనతలు తెలుస్తాయి” అంటూ సలహ ఇచ్చాడు. ఇక నేను పాక్ జట్టు తో 3 సంవత్సరాలుగా ఉంటున్నానని నాకంటే ఎక్కువ మీకేం తెలుసని వ్యాఖ్యానించాడు. బయటి వారు అలా అరుస్తూనే ఉంటారు.. మన పని మనం చేసుకోవాలని ఆయన అన్నారు. మరి రిజ్వాన్ బ్యాటింగ్ పై అక్తర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This combination is not working. Pakistan has to look into a lot of things. Fakhar, Iftikhar, Khushdil all need to be looked into. And Rizwan, 50 off 50 is not going to work anymore. Doesn’t benefit Pakistan.
Hats off to Sri Lanka. What a teamFull video: https://t.co/rYk3d01K65
— Shoaib Akhtar (@shoaib100mph) September 11, 2022