టీ20 వరల్డ్ కప్ లో కీలకమైన.. న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ లో కివీస్ విజయం సాధించి, సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. గ్రూప్ 2 లో సెమీస్ బెర్త్ కోసం జరుగుతున్న ఈ మ్యాచ్.. ఈ రెండు జట్లకు కాకుండా టీమిండియాకి కూడా ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎన్నో అంచనాల నడుమ బ్యాటింగ్ కి దిగిన ఆఫ్ఘనిస్థాన్ కి శుభారంభం లభించలేదు. కివీస్ ఫాస్ట్ బౌలింగ్ దాటికి తట్టుకోలేకపోయిన ఆఫ్ఘన్ బ్యాట్స్మెన్స్ పెవిలియన్ బాటా పట్టేశారు. దీంతో.. ఆఫ్ఘానిస్తాన్ 19 పరుగులకే మూడు కీలకమైన వికెట్స్ చేజార్చుకుంది.
ఈ దశలో బ్యాటింగ్ కి వచ్చిన నజీబుల్ జార్దాన్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఈ దశలో నాయబ్ కలసి జోర్డాన్ కీలక భాగ్యస్వామ్యం ఏర్పరిచాడు. ఇక కివీస్ స్పిన్నర్ల పై విరుచుకుపడ్డ నజీబుల్లా జార్దాన్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే.. మిగతా ఆటగాళ్ల నుండి అతనికి సహకారం లభించకపోవడంతో ఆఫ్ఘన్ 124 పరుగులకే పరిమితం అయ్యింది.
అనంతరం న్యూజిలాండ్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ముగించింది. కివీస్ కెప్టెన్ విలియమ్ సన్, కాన్వే బాధ్యతాయుతంగా ఆడటంతో ఎలాంటి పొరపాటుకి తావు లేకుండా పోయింది. ఈ విజయంతో టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతు అయ్యాయి. మరి.. ఇండియా ఇంటి ముఖం పట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Unfortunatly newzland won vs Afghanistan ,the fourth team to join
Pak,Eng,Aus is Nz 😞😞
Bad luck India 😐💔 pic.twitter.com/s0q4LKe0MF— @India.kannada Harsha (@HarshaKannada) November 7, 2021